20.3 C
Hyderabad
Tuesday, October 27, 2020

ఒక్క హత్యను కప్పిపుచ్చుకోవడానికి.. 9హత్యలు

హైదరాబాద్‌ : వరంగల్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన బావిలో శావాల కేసు మిస్టరీ వీడింది. ఇవి ఆత్మహత్యలు కావు హత్యలని పోలీసులు తేల్చారు. అత్యంత పకడ్బందీగా సాగిన విచారణ పక్కా ఆధారాలతో కేసును చేధించారు. ఒక్క హత్యను కప్పిపుచ్చుకోవడానికి నిందితుడు మరో 9 మందిని అమానవీయంగా హతమార్చాడు. తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపి అందరూ నిద్రపోయిన తరువాత ఒక్కొక్కరినీ తీసుకెళ్లి బావిలో పడేశాడు. ఈ నెల 21 వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామం వద్ద ఓ బావిలో 4 మృతదేహాలు తేలడంతో ఈ ఘటన బయట పడింది. మరుసటి రోజు మరో ఐదు మృతదేహాలు బావిలోనుంచి వెలికి తీశారు. 9 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా గొర్రెకుంట గ్రామం వద్ద ఉన్న గోనె సంచుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. బావిలో శావాలను చూసిన ఆ ఫ్యాక్టరీ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు వివరాలను వరంగ్‌ల్‌ సీపీ రవీందర్‌ మీడియాకు  వెల్లడించారు.

- Advertisement -

Latest news

Related news

జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు ప్రభుత్వం దసరా కానుక అందజేసింది. అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 840 రెండు పడక...

దేశంలో 79లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతుందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 79లక్షలకు చేరువైంది. గత 24గంటల్లో 45వేల 149కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల...

పాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఈరోజు ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ...