రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఓఆర్ఆర్ పై 10 ట్రామా కేంద్రాలు, 10 అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ లను మంత్రి కేటీఆర్ ప్రాంరంభించారు. దీంతో ఓఆర్ఆర్ పై పూర్తి స్ధాయి మెడికల్ ఎమర్జెన్సీ అందుబాటులోకి వచ్చింది. 24 గంటలపై ఈ ట్రామ సెంటర్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్,ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి పాల్గొన్నారు.