21.5 C
Hyderabad
Wednesday, January 20, 2021

ఓటేసుడు మరిశిన నగర ఓటర్లు

ఓటు వేయిర్రి.. మనకు రాజ్యాంగం ఇచ్చిన వజ్రాయుధం ఓటు.. అని.. సీన్మహీరోలు, మినిష్టర్లు, ఎమ్మెల్యేలు గల్లి గల్లి తిరిగి చెప్పినా.. వీడియోలు చేశి వాట్సప్ ల పంపినా.. సభలల్ల చెప్పినా.. పట్నంల ఓటర్లు మాత్రం ఇండ్లల్లకెల్లి బైటకు రాలేదు.

ఓటు ఈజ్ యువర్ రైట్, ఓటు ఫర్ బెటర్ సొసైటీ, ఓటు వేయండి.. నోటుకు లొంగకుండా ఓటు వేయండి.. అని ఎన్నో నినాదాలు చేశినా.. గ్రేటర్ ప్రజలు మాత్రం అస్సలు పట్టించుకోలేదు. ఇండ్లల్లకెల్లి బైటకెల్లి ఓటేయనీకె పోలింగ్ బూత్ వరకు కూడా రాలేకపోయిర్రు. ఈ దెబ్బకు.. మునుపెన్నడూ లేనంతగా ఈసారి పోలింగ్ శాతం దారుణంగా పడిపోయింది.

ఓటర్లు ఇండ్లల్లకెల్లి బైటకు రాక.. ఒంటిగంట వరకు కేవలం 18.2 శాతం  పోలింగ్ మాత్రమే నమోదైంది. బాగ చైతన్యం ఉండి.. ఎక్కువమంది సదువుకున్నోళ్లు ఉన్న హైదరబాద్ పట్నంలనే.. ఓటేయనీకె జనాలు బైటకు రాలేదంటే ఎంత నామర్ద? పొద్దటిసంది రాకపోయినా.. కనీసం మధ్యాహ్నమన్న.. ఓట్లెయ్యనీకె వస్తరనుకుంటే.. సాయంత్రం నాలుగు దాటినా.. పరిస్థితిల మార్పు రాలేదు. హైదరాబాద్‌ గ్రేటర్ హైదరాబాద్ గా మారినంక 2010ల తొలిసారి జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే.. కేవలం.. 42.92 శాతం మంది మాత్రమే ఓట్లేశిర్రు. ఆ తర్వాత 2016ల జరిగిన జీహెచ్ఎంసీ ఎలక్షన్లల్ల  పోలింగ్ శాతం జెరంత పెరిగింది.

2016లో 45.29 శాతం ఓటింగ్ నమోదైంది. గత రెండు ఎలక్షన్లల్ల హైదరాబాద్‌ల 50శాతం కూడా పోలింగ్ దాటలే. ఇగ ఈసారి ఎన్నికల ముచ్చటకొస్తే.. ఓటు వేయనీకె కూడా ఎవరూ రాలేదు. అంతో.. ఇంతో.. శాతగానోళ్లన్న కట్టె పట్టుకోని ఓటెయ్యనీకె వచ్చిర్రు గానీ.. యూత్ పోరగాళ్లు మాత్రం అసలు పోలింగ్ కేంద్రాల దిక్కే సూడలేదు. ఓ దిక్కు చలి, మరో దిక్కు కరోనా
బీమారితో పోలింగ్ తగ్గిందని అధికారులు చెప్తున్నరు. పోలింగ్ డేని హాలిడేగా కొంతమంది కార్పొరెట్ ఉద్యోగులు బాధ్యత మరిచి ఎంజాయ్ చేశిర్రు. అవగాహన ఉన్నోళ్లు కూడా.. ఓటు వేయకపోవడం బాధ్యతారాహిత్యమే అంటూ నగర ఓటర్ల మీద బుద్ధిజీవులు కోపమైతున్నరు. ఓటు వేయనీకె ఇంత బద్ధకమా? కనీస బాధ్యత ఉండాలె గదా? ఇప్పుడు ఓటు వేయకుండా..రేపు మాకు ఈ సౌలత్ గావాలె.. ఆ సౌలత్ గావాలె.. అని ఏ మొకం పెట్టుకోని అడుగుతరు? అంటున్నరు.

- Advertisement -

Latest news

Related news

కొత్త సాగు చట్టాలు.. 18 నెలలపాటు అమలు వాయిదా

కొత్త సాగు చట్టాలకు సంబంధించి రైతు సంఘాల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన ఉంచింది. రైతు సంఘాలు లేవనెత్తిన మూడు కీలక చట్టాల అమలును 18 నెలలపాటు నిలిపివేయనున్నట్లు చెప్పింది....

బైడెన్ పట్టాభిషేకానికి బరాక్, క్లింటన్, బుష్

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పట్టాబిషేక కార్యక్రమానికి ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా- మిచెల్ ఒబామా, బిల్ క్లింటన్- హిల్లరీ క్లింటన్‌,...

బైడెన్ తొలి సంతకం వీటిపైనే..

అమెరికా ప్రెసిడెంట్ గా బైడెన్ మరికొన్ని గంటల్లో బాధ్యతలు తీసుకోనున్నారు. బాధ్యతలు చేపట్టిన మరు క్షణమే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని వివాదస్పద అంశాలను రద్దు చేస్తూ తొలి సంతకం...

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ఆవిష్కరణ

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ని మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మినిస్టర్ ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఇంటింటికి...