గ్రేటర్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. మొత్తం.. 150 డివిజన్లలో ఉదయగ 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. 18 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో తొలిసారి బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతున్నది. కాగా.. ఓల్డ్ మలక్ పేట డివిజన్లో పోలింగ్ గుర్తులు తారుమారు కావడం వల్ల.. ఆ స్థానంలో రీపోలింగ్ నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు.

డివిజన్లోని 69 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పోలింగ్ రద్దయిన చోట ఈ నెల 3న రీ పోలింగ్ నిర్వహించనున్నారు. బ్యాలెట్ పత్రంలో గుర్తులు తారుమారు కావడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. సీపీఐ అభ్యర్థి ఎదురుగా.. సీపీఎం గుర్తును ముద్రించారు. సీపీఐ గుర్తు అయిన కంకి కొడవలికి బదులు.. సుత్తి కొడవలి గుర్తు అచ్చయింది. సీపీఐ ఎన్‌ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆ డివిజన్లో రీపోలింగ్ జరిపేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత వచ్చే ఎగ్జిట్ పోల్స్‌ను నిషేధించినట్లు ఎస్ఈసీ పేర్కొంది.