రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై రెండు కార్లు ఢీ కొన్నాయి. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన ఇద్దరు వ్యక్తులు సూర్యాపేట జిల్లా వాసులుగా గుర్తించారు. అతిగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.