18.6 C
Hyderabad
Wednesday, October 28, 2020

కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు

నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆయన కంటోన్మెంట్‌ బోర్డు సమావేశంలో పాల్గొన్నారు. కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నామని వెల్లడించారు. కంటోన్మెంట్‌కు నెలకు రూ.10 కోట్లు ఇచ్చేలా, తాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. బోర్డు, వార్డు సభ్యులు ప్రజల మధ్య ఉంటూ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించారు. కంటోన్మెంట్‌లో రెవెన్యూ పెంచుకునే దిశగా అధికారులు దృష్టిసారించాలని ఆదేశించారు. 

- Advertisement -

Latest news

Related news

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...

నాయిని సతీమణి మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిప‌ట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహ‌ల్య భౌతిక‌కాయానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.   నాయిని సతీమణి...

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్ట్

సినీ నటి, బీజేపీ నేత కుష్బూను అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. వీసీకే అధినేత తిరుమావళవన్‎ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుండి చిదంబరంకు వెళ్తుండగా ముత్తుకాడులో...