22.9 C
Hyderabad
Friday, December 4, 2020

కరోనా కట్టడికి ఆరు సూత్రాలు అమలు..

హైదరాబాద్ : కరోనా కట్టడికి నగర పోలీసులు ఆరు సూత్రాలను అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌తో బిజీగా ఉంటూ.. మరో పక్క తమ రోజు వారి విధులపై దృష్టిపెట్టిన పోలీసులు కరోనా దరిచేరకుండా ఉండేందుకు ప్రతి పోలీస్‌స్టేషన్‌లో తప్పని సరిగా కొన్ని నియమ నిబంధనలు పాటించేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కరోనాతో నగరానికి చెందిన ఓ కానిస్టేబుల్‌ మృత్యువాత పడటం, మరికొందరికి పాజిటివ్‌ కూడా రావడంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ విధులు నిర్వహించాలని పోలీసులు ఉన్నతాధికారులు సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కరోనాను ఎదుర్కోవడం కోసం పోలీస్‌స్టేషన్లలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

పోలీస్‌స్టేషన్‌లోకి వచ్చేవారికి..!

ప్రతి పోలీస్‌స్టేషన్‌కు షిప్ట్‌ల వారీగా వచ్చే సిబ్బందితో పాటు ఫిర్యాదుదారులు, వివిధ కేసుల నిమిత్తం నిందితులు, బస్తీలు, కాలనీల నుంచి వచ్చిపోతుంటారు. దీంతో పాటు బందోబస్తు, పెట్రోలింగ్‌, బస్తీలు, కాలనీల్లో చిన్న చిన్న గొడవలు, సంఘటనా స్థలాల సందర్శన, మృతదేహాల తరలింపు, దవాఖానలకు తరలించడం, కోర్టులకు వెళ్లడం ఇలా పోలీస్‌స్టేషన్‌లోని సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు.

ఇవి పాటించాలి..

* పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలోకి ప్రవేశించగానే చేతులు సబ్బుతో కడుక్కోవాలి. అందుకు ఆయా ఠాణాలలో ఏర్పాట్లు చేస్తున్నారు.

* స్టేషన్‌లోకి వచ్చే వారు తప్పని సరిగా మాస్కులు ధరించాలి. ఒక వేళ మాస్కు ధరించకుంటే పరిస్థితులను బట్టి పోలీసులు వారికి సమకూరుస్తారు.

* ఫిర్యాదు దారులు ఫిర్యాదు ఇచ్చేందుకు రిసెప్షన్‌ వద్దకు వెళ్తారు. అక్కడుండే సిబ్బందికి ఫిర్యాదుదారులకు మధ్య ఆరు అడుగుల దూరం తప్పని సరిగా ఉండాలి. ఇందుకు మధ్యలో చెట్ల కుండీలను ఏర్పాటు చేసుకోవాలి. 

* ప్రతి పోలీస్‌ సిబ్బంది జేబులో 100 ఎంఎల్‌ శానిటైజర్‌ ఉండాలి. ఫీల్డ్‌ వర్క్‌కు వెళ్లేవారు తప్పనిసరిగా జేబులో ఉంచుకోవాలి.

* చేతికి గ్లౌస్‌లు తప్పని సరి. వివిధ కేసుల దర్యాప్తులో బయటకు వెళ్లే సిబ్బంది చేతులకు తప్పనిసరిగా ధరించాలి.

* సిబ్బంది రోజువారీగా తమ దుస్తులను డెటాల్‌ వంటి లిక్వెడ్స్‌తో ఊతుక్కోవాలి. 


పోలీసులది రెండో స్థానం: హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌

కరోనాతో జరుగుతున్న యుద్ధంలో వైద్యుల తరువాతి స్థానంలో పోలీసులు ఉండి పోరాడుతున్నారు. అలాంటి సమయంలో ప్రతి ఒక్క పోలీస్‌ స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాం. కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌లో అన్ని రకాల ఏర్పాట్లు చేసి, నగరంలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. పోలీస్‌స్టేషన్‌లోకి వచ్చే వారు కూడా శుభ్రతతో వచ్చేందుకు వీలుగా చేతులు కడుక్కునే ఏర్పాట్లు ఆయా ఠాణాల ఆవరణలో ఉంటుంది.

- Advertisement -

Latest news

Related news

బొంతు శ్రీదేవి విజయం – కొనసాగుతున్న కారు హవా

గ్రేటర్ ఫలితాల్లో కారు టాప్ గేరులో దూసుకుపోతోంది. అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్‌ జోరు చూపిస్తోంది. ఇప్పటికే 29 చోట్ల విజయం సాధించిన గులాబీ...

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.