22.4 C
Hyderabad
Tuesday, October 27, 2020

కరోనా సంక్షోభం ఉన్నా రైతుబంధు డబ్బులు ఇస్తాం..

కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా… రైతులు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశ్యంతో  రైతులందరికీ వెంటనే రైతుబంధు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు సీఎం కేసీఆర్. ఏ ఒక్క రైతునూ మినహాయించకుండా అందరికీ రైతుబంధు డబ్బులు వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఎవరికి రైతుబంధు సాయం రాకున్న వారి వివరాలు తీసుకుని డబ్బు అందేలా చూడాలని చెప్పారు.

వర్షాకాలంలో నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేయాలని ప్రభుత్వం పిలుపునిస్తే… రైతులు సంపూర్ణంగా పాటించారన్నారు సీఎం కేసీఆర్.  చెప్పిన ప్రకారం రైతులు  పంటలు సాగు చేస్తున్నారన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి… ప్రయత్నానికి రైతుల నుంచి మద్దతు లభించిని అభిప్రాయపడ్డారు. యాసంగిలో కూడా ఏ పంటలు వేయాలనే విషయంలో ప్రణాళిక రూపొందించి, అందుకు అనుగుణంగా సాగు చేయించాలని కలెక్టర్లు , అధికారులకు సూచించారు.

తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అద్భుత వ్యవసాయ రాష్ట్రంగా రూపాంతరం చెందుతున్నదన్నారు సీఎం కేసీఆర్. ఈ  సమయంలో రైతులకు మరింత చేదోడు వాదోడుగా ఉండాలన్నారు. రైతులకు అవసరమైన అవగాహన కల్పించడానికి, రైతులు పరస్పరం చర్చించుకోవడానికి వీలుగా క్లస్టర్ల వారీగా రైతు వేదికలు నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ వేదికల నిర్మాణం నాలుగు నెలల్లో పూర్తి కావాలని తెలిపారు.

నకిలీ, కల్తీ విత్తనాల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. పోలీసుల సహకారంతో నకిలీ విత్తన వ్యాపారం చేసే వారిని పట్టుకోవాలన్నారు. వారిపై  పిడి యాక్టు నమోదు చేయాలని ఆదేశించారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారన్న సీఎం…విలువైన పంటకాలం పాడవుతుందన్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురై రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడన్నారు. నకిలీ విత్తన వ్యాపారులు రైతు హంతకులన్న సీఎం…. వారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని స్పష్టంచేశారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో నకిలీ, కల్తీ విత్తనాల దందా ఆగిపోవాలని… రైతుబంధు సమితులు నకిలీ విత్తనాలను అమ్మే వారిని పట్టుకునే విషయంలో చురుగ్గా వ్యవహరించాలని సూచించారు.  నకిలీ, కల్తీ విత్తనాలు అమ్మే సమాచారం ఇచ్చిన వారికి 5వేల నగదు ప్రోత్సాహం ఇవ్వాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. వారి పేర్లు గోప్యంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో సాగునీటి వసతి పెరగడంతో పాటు…. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, మంచి వర్షాల కారణంగా పంటల దిగుబడి పెరుగుతున్నదన్నారు సీఎం కేసీఆర్. దేశ వ్యాప్తంగా ఎఫ్.సి.ఐ. సేకరించిన ధాన్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచే  55 శాతం ఉందన్నారు. ఇది మన రైతాంగానికి గర్వకారణమని… వ్యవసాయంలో సాధించిన ప్రగతికి సంకేతమని సీఎం అభిప్రాయపడ్డారు.  వ్యవసాయ ఉత్పత్తులు పెరగడంతో పాటు కనెక్టెడ్ యాక్టివిటీ జరగాలని…  పండిన ధాన్యమంతా బియ్యంగా మారేందుకు అవసరమైన మిల్లింగ్ సామర్థ్యం పెరగాలని సీఎం తెలిపారు.  అలాగే పప్పులు, నూనెలు, పిండి తయారీకోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కావాలన్నారు.  ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించించినట్లు తెలిపారు.  ఈ సెజ్ లకు కనీసం 500 మీటర్ల దూరం వరకు నివాస గృహాల నిర్మాణం కోసం లే అవుట్లకు అనుమతి ఇవ్వవద్దని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Latest news

Related news

జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు ప్రభుత్వం దసరా కానుక అందజేసింది. అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 840 రెండు పడక...

దేశంలో 79లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతుందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 79లక్షలకు చేరువైంది. గత 24గంటల్లో 45వేల 149కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల...

పాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఈరోజు ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ...