28.4 C
Hyderabad
Thursday, October 1, 2020

కవిత్వంతో ప్రజల్లో చైతన్యం రగిల్చిన కలం యోధుడు దాశరథి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహాకవి దాశరథి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజాకవి అని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కీర్తించారు. జైల్లో నిర్బంధించినా జైలు గోడల మీద కవిత్వాన్ని రాసి ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన కలం యోధుడు అని కొనియాడారు. మహాకవి దాశరథి 96వ జయంతిని రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత తెలంగాణ కవులకు గౌరవం లభిస్తోందని.. వారి జయంతులను అధికారికంగా భాషా సాంస్కృతిక శాఖ ద్వారా నిర్వహిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ కవుల పక్షపాతిగా అభివర్ణించారు. మహాకవి దాశరథి జయంతిని అధికారికంగా నిర్వహించటానికి ఆదేశాలు ఇవ్వడమే కాక, ప్రతి సంవత్సరం ప్రముఖ కవులకు సత్కారం, పురస్కారాలను అందిస్తున్నారన్నారు. 2020 సంవత్సరపు దాశరథి పురస్కారాన్ని డా. తిరునగరి రామనుజయ్యను ఎంపిక చేశామని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.

నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని దాశరథి అన్న మాట ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రజలందరినీ ఉర్రూతలూగించిందన్నారు. సీఎం కేసీఆర్‌ దాశరథి మాటలనే స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేసే మహాయజ్ఞం చేస్తున్నారన్నారు. ఇప్పటికే 70 లక్షల ఎకరాలకు సాగునీరును అందించే సదుపాయం చేశారన్నారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌. ఈ సందర్భంగా దాశరథి కుటుంబ సభ్యులను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.

- Advertisement -

Latest news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

Related news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

లైంగిక వేధింపుల కేసులో పోలీసుల ముందుకు అనురాగ్‌ కశ్యప్‌

లైంగిక వేధింపుల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ఫిల్మ్ డైర‌క్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ ..  ముంబైలోని వెర్సోవా పోలీసుల ముందు హాజరయ్యారు. న‌టి పాయల్ ఘోష్  ఆరోపణలతో పలు విషయాలపై...

రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 75వ వసంతం లోకి అడుగుపెట్టిన సందర్భంగా సీఏం కేసీఆర్ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు....

దేశంలో 24 గంటల్లో 86,821 కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య లక్షకు చేరువైంది. నిన్నటికి నిన్న 1వెయ్యి 181 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 98వేల678...