22.9 C
Hyderabad
Friday, December 4, 2020

కాంగ్రెస్‌ నేతలు సిగ్గుపడాలి : కేటీఆర్‌

రాజన్న సిరిసిల్ల : పోతిరెడ్డిపాడు జీవో ఇచ్చింది నాటి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం కాదా? అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ఆ రోజు కళ్లప్పగించి చూసింది ఈ కాంగ్రెస్‌ నాయకులు కాదా? ఆనాడు కృష్ణా జలాలను తరలించుకుపోయేందుకు హారతులు పట్టింది కాంగ్రెస్‌ కాదా? అని కేటీఆర్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నేతలు సిగ్గుపడాలి అని ఆయన విమర్శించారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా ముస్తాబాద్‌లో రైతు వేదిక నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. రాచర్ల గొల్లపల్లిలో వ్యవసాయ గోదాంకు శంకుస్థాపన చేశారు. రాచర్ల బొప్పాపూర్‌లో మార్కెట్‌ కమిటీ పరిపాలన భవనాన్ని ప్రారంభించారు. రైతు భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. 

ఈ సందర్భంగా రాచర్ల బొప్పాపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం అని ఆయన తెలిపారు. ఎండాకాలంలోనూ నీళ్లు అందిస్తున్న కాళేశ్వరంపై కూడా విమర్శలు చేస్తున్నారు. రైతులకు అన్యాయం చేసే పని కేసీఆర్‌ చేయరు.. ఎవరినీ చేయనీయరు. రైతును రాజును చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆలోచన అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినప్పుడు మొదట విమర్శిస్తారు. మనమంతా సంఘటితమై విజయం సాధిస్తే అందరూ మనవెంటే వస్తారు అని మంత్రి సూచించారు. 

మూడేళ్ల రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాం. ఎండకాలంలోనూ తెలంగాణలోని చెరువులు నిండుకుండలా కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఇన్ని నీళ్లను చూసి ప్రతిపక్షాలకు కళ్లు మండుతున్నాయి. సీఎం కేసీఆర్‌ ఉన్నంత వరకు రైతులకు అన్యాయం జరగదు. రైతు వేదిక బలపడితేనే రైతు బాగుపడుతాడు అని కేటీఆర్‌ పేర్కొన్నారు. రైతు వేదిక నిర్మాణాలకు ముందుకొస్తున్న వారందరికీ కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు

- Advertisement -

Latest news

Related news

బొంతు శ్రీదేవి విజయం – కొనసాగుతున్న కారు హవా

గ్రేటర్ ఫలితాల్లో కారు టాప్ గేరులో దూసుకుపోతోంది. అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్‌ జోరు చూపిస్తోంది. ఇప్పటికే 29 చోట్ల విజయం సాధించిన గులాబీ...

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.