21.5 C
Hyderabad
Saturday, November 28, 2020

కృష్ణానదికి క్రమంగా తగ్గుతున్న వరద ఉధృతి

ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణానదికి వరద క్రమంగా తగ్గుతోంది. మనరాష్ట్రంలో  కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండగా.. కర్నాటకలో వరద ఉధృతి కొంత తగ్గింది. నిన్న ఉదయం ఆల్మట్టి ప్రాజెక్టుకు రెండున్నర లక్షల క్యూసెక్కులకు పైగా  ఇన్ ఫ్లో ఉండగా.. సాయంత్రానికి రెండు లక్షల క్యూసెక్కులకు తగ్గింది. దీంతో దిగువకు  ఔట్ ఫ్లోను లక్ష క్యూసెక్కులకు తగ్గించారు. అయితే నిన్న సాయంత్రానికి జూరాల ప్రాజెక్టుకు భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతున్నది. ఇప్పటికే ప్రాజెక్టు నిండుకుండలా మారటంతో అధికారులు వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు.                               

అటు శ్రీశైలం జలాశయానికి వరద క్రమంగా తగ్గుతోంది. కృష్ణాజలాలకు తుంగభద్ర కూడా తోడవ్వటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు  రెండున్నర లక్షలకు పైగా ఇన్ ఫ్లో వస్తోంది. వరద క్రమంగా తగ్గుతుండటంతో నిన్న అధికారులు రెండు గేట్లను మూసివేశారు. 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి రెండున్నర లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు   విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 215 టీఎంసీలు కాగా  ప్రస్తుతం నీటి నిల్వ 208 టీఎంసీలుగా ఉంది.  అటు వీకెండ్ కావటంతో శ్రీశైలం ప్రాజెక్టును చూసేందుకు జనం తరలివచ్చారు. అద్భుత జలదృశ్యాన్ని తమ ఫోన్ లో బంధిస్తూ.. సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు. తెలంగాణ, ఏపీతో పాటు కర్ణాటక నుండి కూడా.. ప్రజలు పెద్దెత్తున వచ్చి జలాశయం అందాలను అస్వాదిస్తున్నారు.  శ్రీశైలం ప్రాజెక్టు నుండి వస్తున్న వరదతో.. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు  జలకళ సంతరించుకున్నది. సాగర్‌ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నది. దీంతో పులిచింతల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో.. ప్రజలు భారీగా  తరలివస్తున్నారు. కరోనా  నేపథ్యంలో మాస్క్‌లు ధరించి కృష్ణమ్మ అందాలను ఆస్వాదిస్తున్నారు.  

శ్రీశైలం ప్రాజెక్టు నుండి వస్తున్న వరదతో.. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు  జలకళ సంతరించుకున్నది. సాగర్‌ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నది. దీంతో పులిచింతల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో.. ప్రజలు భారీగా  తరలివస్తున్నారు. కరోనా  నేపథ్యంలో మాస్క్‌లు ధరించి కృష్ణమ్మ అందాలను ఆస్వాదిస్తున్నారు.   

- Advertisement -

Latest news

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

Related news

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా నందిగామ మేకగూడా బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నందిగామ వద్ద బైపాస్‌ రోడ్డు...

జమ్మూకాశ్మీర్‌లో కోనసాగుతున్న డీడీసీ ఎన్నికల పోలింగ్

జమ్మూకాశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడుత  పోలింగ్‌ శనివారం ఉదయం ప్రారంభమైంది. జిల్లా అభివృద్ధి మండళ్లు(డీడీసీ), పంచాయితీ ఉప ఎన్నికలకు నేటి నుంచి పోలింగ్ జరగనుంది.ఆర్టికల్‌ 370 రద్దు...