కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు చేసిన మీడియా సమావేశాం లో పాల్గోన్నారు. మీడియా సమావేశాం లో ఆయన మాట్లాడుతూ… కేంద్రం నుంచి వచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదని, రాష్ట్రం నుంచి వెళ్తున్న డబ్బుపైనే కేంద్రం బతుకుతున్నదని ఎంపీ నామా నాగేశ్వర్రావు అన్నారు. హైదరాబాద్కు ఏం చేసిందో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధిపై బీజేపీ నేతలు ఎప్పుడైనా పార్లమెంటులో మాట్లాడారా అని ప్రశ్నించారు నామ. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులపై లెక్కలు చెబుతామన్నారు. రాష్ట్రం నుంచి పన్నుల ద్వారా కేంద్రానికి రూ.2.75 లక్షల కోట్లు వెళ్లాయని చెప్పారు. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లలో పన్నుల ద్వారా రూ.3 వేల కోట్లకుపైగా వెళ్తున్నాయన్నారు. ఆ రూ.3 వేల కోట్లలో కేవలం 30 శాతం మాత్రమే తెలంగాణకు ఇస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో పన్నుల ద్వారా వచ్చిన నిధులను ఇతర రాష్ట్రాల్లో వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.