27.3 C
Hyderabad
Tuesday, November 24, 2020

కేంద్రం మాటల సర్కారు మాత్రమే.. చేతల సర్కారు కాదు: సీఎం కేసీఆర్‌

కేంద్రప్రభుత్వ వైఖరిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం మాటల ప్రభుత్వమే తప్ప.. చేతల సర్కారు కాదన్నారు. బీజేపీకి ఎప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టాలి? తమ ప్రభుత్వాన్ని ఎలా తీసుకొచ్చుకోవాలనే ఆలోచనే ఉంటుందని మండిపడ్డారు. మనకు రావాల్సిన జీఎస్టీ పరిహారంతో పాటు సాధారణంగా ఇవ్వాల్సిన నిధులను కూడా ఇవ్వడం లేదని గుర్తుచేశారు. పార్లమెంట్‌ సమావేశాల్లో కలిసొచ్చే పార్టీలతో సమిష్టిగా ప్రజాసమస్యలపై పోరాటంచేయాలని పార్టీ ఎంపీలను ఆదేశించారు. అనేక అంశాల్లో విఫలమైన కేంద్రాన్ని నిలదీయాలన్నారు. దేశాన్ని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్‌, బీజేపీ రెండూ విఫలమయ్యాయని తెలిపారు. ఆ పార్టీలకు నినాదాలు తప్ప, ప్రజల అభివృద్ధి, సంక్షేమం పట్టదని పేర్కొన్నారు. బీజేపీ పాకిస్థాన్‌ను బూచీగా చూపించి రాజకీయాలు చేస్తున్నదని చెప్పారు.

కరోనాతో ప్రభుత్వం, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని సీఎం కేసీఆర్‌ అన్నారు. కేంద్రం అకస్మాత్తుగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, నాలుగు రోజులు సమయమిచ్చిన తర్వాత లాక్‌డౌన్‌ పెడుదామని తాను కేంద్రానికి సూచించినా పట్టించుకోలేదని తెలిపారు. కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన జీఎస్టీ పరిహారాన్ని కూడా ఇవ్వడంలేదని గుర్తుచేశారు. వ్యవసాయ రంగాన్ని తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నదని, రాష్ట్రంలో ఇప్పటికే 1.40 కోట్ల ఎకరాల్లో పంట సాగయ్యిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులైనా నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. నియోజకవర్గంలోని ప్రజలు తమ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఏం ప్రశ్న అడుగుతున్నాడనేది చూస్తారని, కాబట్టి ప్రతి ఎమ్మెల్యే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నియోజకవర్గాలకు సంబంధించి మంత్రులు, ఇతరులు.. స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు. దళితులకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ ఉన్నా ఇంకా వారు అనుకున్నంత అభివృద్ధి సాధించడం లేదని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీల కోసం దళిత జ్యోతి కార్యక్రమాన్ని అమలుచేద్దామన్న సీఎం.. దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒకసారి సమావేశమై ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో చెప్పాలని సూచించారు

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...