కేంద్ర ప్రభుత్వం తక్షణమే పీవీకి, ఎన్టీఆర్కు భారతరత్న ప్రదానం చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఆ తర్వాతే బీజేపీ నేతలు హైదరాబాద్ లో మాట్లాడాలని ఆమె స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చే విషయాన్ని బీజేపీ పట్టించుకోలేదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా చేస్తున్నామని ఆమె తెలిపారు. ఇక కేంద్ర మంత్రులు ఉత్త చేతులతో హైదరాబాద్ వస్తున్నారు తప్ప..వరదసాయం గురించి మాట్లాడడంలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.