19.4 C
Hyderabad
Monday, November 30, 2020

కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్

జనగామ జిల్లా కొడకండ్లలో సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం ఒంటి గంట స‌మ‌యంలో రైతు వేదిక‌ను ప్రారంభించారు. దేశచరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్  శ్రీకారం చుట్టారు. రైతు వేదిక ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, రైతు స‌మ‌న్వ‌య స‌మితి అధ్య‌క్షుడు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 

కొడ‌కండ్ల‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ కు ప్ర‌జాప్ర‌తినిధులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికి ఆశీర్వ‌దించారు. అర్చ‌కుల మంత్రోచ్ఛ‌ర‌ణాల మ‌ధ్య రైతు వేదిక శిలాఫ‌ల‌కాన్ని సీఎం ఆవిష్క‌రించారు. రైతులు పెద్ద ఎత్తున చ‌ప్ప‌ట్లు కొట్టి సీఎం కేసీఆర్‌కు మ‌ద్ద‌తు తెలిపారు. రైతు వేదిక అందుబాటులోకి రావ‌డంతో రైతులంద‌రూ సంతోషం వ్య‌క్తం చేశారు. 

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.