20.3 C
Hyderabad
Tuesday, October 27, 2020

గవర్నర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కు సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజ్ భవన్ లో పుష్పగుచ్చం ఇచ్చి  ఆమెకు అభినందనలు తెలిపారు. గవర్నర్ తమిళిసై పూర్తి ఆరోగ్యంతో సంపూర్ణ జీవితం గడపాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు గవర్నర్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టిన రోజు, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఒకటే రోజు కావడం ఆనందంగా ఉందని గవర్నర్ అన్నారు. జూన్ 2న పుట్టిన తాను, అదే తేదీన పుట్టిన తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా రావడం విధిరాత అని తమిళిసై తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య తెలంగాణ రాష్ట్ర అవతరణకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. భారత స్వాతంత్యం తర్వాత అంత సుదీర్ఘ కాలం జరిగిన ఉద్యమంగా తెలంగాణ ఉద్యమం చరిత్రలో నిలుస్తుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వారి త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రమని చెప్పారు.

- Advertisement -

Latest news

Related news

జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు ప్రభుత్వం దసరా కానుక అందజేసింది. అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 840 రెండు పడక...

దేశంలో 79లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతుందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 79లక్షలకు చేరువైంది. గత 24గంటల్లో 45వేల 149కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల...

పాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఈరోజు ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ...