మహాత్మాగాంధీ 151 వ జయంతి సందర్భంగా.. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గాంధీ విగ్రహానికి మంత్రి జగదీశ్ రెడ్డి నివాళులర్పించారు. మహాత్ముడి అడుగుజాడల్లో నడవటమే మనం మహాత్ముడికిచ్చే ఘనమైన నివాళి అన్నారు. అహింసా మార్గంతోనే స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి జాతిపిత గాంధీ మహాత్ముడన్నారు. గాంధీ చూపిన బాటలో నడవటానికి ప్రతి ఒక్కరూ శాయశక్తుల కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలోగ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు..