కరోనా వైరస్ గాలి ద్వారా సోకుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సంబంధించి తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నట్లు వెల్లడిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయంలో తన మార్గదర్శకాలను మార్చుకోవాలని కూడా శాస్త్రవేత్తలు సూచించారు. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ ఈ అంశంపై ఓ కథనాన్ని రాసింది. 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు.. కరోనా వైరస్ గ్యాలి ద్వారా వ్యాపిస్తుందని పేర్కొంటున్నారు. ఆ శాస్త్రవేత్తలంతా డబ్ల్యూహెచ్వోకు తమ ప్రతిపాదన కూడా పంపారని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది.