24.3 C
Hyderabad
Wednesday, November 25, 2020

గొర్రెకుంట మృత్యుబావి కేసులో దోషికి ఉరిశిక్ష

రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన గొర్రెకుంట మృత్యుబావి కేసులో తుదితీర్పు వెల్ల‌డైంది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు సంజ‌య్ కుమార్ యాద‌వ్‌(24)ను కోర్టు దోషిగా తేల్చింది. ఈ మేర‌కు మొద‌టి అద‌న‌పు జిల్లా కోర్టు నిందితుడిపై నేరం రుజువైన‌ట్లు ప్ర‌క‌టించింది. నిందితుడిపై అభియోగాల‌ను ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ నిరూపించారు. నిందితుడు సంజ‌య్‌కు కోర్టు ఉరిశిక్ష ఖ‌రారు చేసింది. బీహార్‌కు చెందిన సంజ‌య్ కుమార్ ఈ ఏడాది మే 21న తొమ్మిది మందిని హ‌త్య‌చేసి వరంగల్ శివారులోని గీసుకొండలోని గొర్రెకుంట బావిలో పడేసి జ‌ల‌స‌మాధి చేశాడు

- Advertisement -

Latest news

Related news

జమ్మూకశ్మీర్‌ ను ముంచెత్తుతున్న మంచు

జమ్మూకశ్మీర్‌ ను ముంచు ముంచెత్తుతుంది. 8 జిల్లాల్లో భారీ హిమపాతం కురుస్తుండటంతో జమ్మూకశ్మీర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్టుమెంట్ జనం బయటికి రావొద్దంటూ హెచ్చరించింది. ఇటు లడఖ్, కుప్వారా, బండిపొరా ప్రాంతాల్లో...

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...