18.2 C
Hyderabad
Sunday, January 17, 2021

గోల్టెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రరెడ్డి

టీ-న్యూస్‌, అపెక్స్‌ ఎడ్యుకేషన్ సర్వీస్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌ అమీర్‌ పేట్‌ లోని కమ్మ సంఘం భవనంలో నిర్వహిస్తున్న ఫెయిర్‌ ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు ఈ ఫెయిర్‌ను నిర్వహించనున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న ఈ ఫెయిర్‌లో వేలాది మంది విద్యార్థులు పాల్గొని తమతమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జూబ్లీ హిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌, టీన్యూస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ సురేశ్‌ బాబు, సీజీఎం ఉపేందర్‌ పాల్గొన్నారు.

విద్యారంగంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. స్వరాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కాలేజీలు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయన్నారు. అందుకే తెలంగాణలో ఇంజనీరింగ్‌ చదివేందుకు ఇతర రాష్ట్రాల విద్యార్థులు అమిత ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉద్యమ గొంతుకాగా నిలిచిన టీన్యూస్‌.. ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్‌ కు బంగారు బాటలు వేస్తోందని ప్రశంసించారు. ఇన్నేండ్లుగా ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని మెచ్చుకున్నారు. ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ తో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు.. సంపూర్ణమైన అవగాహన వస్తదని ఎమ్మెల్యే గోపినాథ్‌ తెలిపారు.

వందకు పైగా కళాశాలల యాజమాన్యాలు ఈ ఫెయిర్‌లో స్టాల్స్‌ ను ఏర్పాటు చేశాయి. వారివారి కళాశాలల్లో అందిస్తున్న కోర్సులు, ఫ్యాకల్టీ, ప్లేస్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను విద్యార్థులకు అందిస్తున్నారు. ఆయా రంగాల్లో నిష్ణాతులైన నిపుణులు, విద్యావంతులు, ప్రొఫెసర్లు ఈ వేదిక ద్వారా సెమినార్‌లు, వర్క్‌ షాపులు నిర్వహించి విద్యార్థులు, తల్లిదండ్రుల సందేహాలన్నింటిని నివృత్తి చేస్తున్నారు. మాక్‌ వెబ్‌ కౌన్సిలింగ్‌ కూడా నిర్వహిస్తున్నారు. వెబ్‌ ఆప్షన్స్‌ సమయంలో తీసుకోవాల్సిన మెలుకువలను తెలియజేసి.. విద్యార్థి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు.

కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా గోల్డెన్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ ను నిర్వహిస్తున్నారు. ప్రతి రెండుగంటలకు ఒకసారి ఫెయిర్‌ నిర్వహిస్తున్న ప్రాంగణం అంతా శానిటైజేషన్‌ చేస్తున్నారు. టెంపరేచర్‌ చెక్‌ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తున్నారు.

ఫెయిర్‌ ప్రాంగణంలో ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి భయం లేకుండా ఫెయిర్‌లో పాల్గొంటున్నారు.

- Advertisement -

Latest news

Related news

కొవిడ్ వ్యాక్సిన్ బండికి బాజాభజంత్రీలతో స్వాగతం

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లో...

మొదటిరోజు వాక్సినేషన్ విజయవంతం

రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మొత్తం 4296 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈరోజు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

1020వ గుండెను కాపాడిన సూపర్ స్టార్

సాటివారికి సాయం చేయడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. తాను నిజంగా కూడా శ్రీమంతుడినే అని నిరూపించుకున్న సంఘటనలు బోలెడున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత...

తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నేషనల్ పార్క్ బంద్

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ఐసీఎఆర్...