19.8 C
Hyderabad
Monday, November 30, 2020

గ్రీన్ ఛాలెంజ్: మొక్కలు నాటిన రామ్‌ చరణ్‌

ఎంపీ సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఛాలెంజ్‌ కార్యక్రమం మహోద్యమంలా కొనసాగుతోంది. ఈ ఛాలెంజ్‌లో పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు భాగస్వాములు అవుతున్నారు. తాజాగా రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ విసిరిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ స్వీకరించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ‌లోని తన నివాసంలో ఎంపీ సంతోష్‌ కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి, హీరోయిన్‌ అలియాభట్‌తో పాటు  RRR టీంను గ్రీన్ ఛాలెంజ్‌కు నామినేట్‌ చేశారు. పర్యవరణ పరిరక్షణకై నిరంతం కృషి చేస్తున్న ఎంపీ సంతోష్‌ కుమార్‌ను అభినందించారు.. గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగస్వామి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.. మెగా అభిమానులు పెద్ద ఎత్తున గ్రీన్‌ ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు..

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.