19.8 C
Hyderabad
Monday, November 30, 2020

గ్రేటర్‌లో మరో 24 బస్తీ దవాఖానాలు

చిన్న జబ్బు వచ్చిందంటే చాలు ఆసుపత్రులకు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిందే. వైద్య పరీక్షలకు ఉన్నదంతా ఊడ్చి ఇచ్చినా సరిపోని పరిస్థితి. ప్రతి చిన్న రోగానికి పెద్దాసుపత్రులకు వెళ్లడం.. అటు వైద్యసిబ్బందికి.. ఇటు రోగులకు ఇబ్బందికరమే. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాలు సత్ఫలితాలిస్తున్నాయి. బస్తీ దవాఖానాలకు మంచి ఆదరణ వస్తుండటంతో వాటి సంఖ్యను మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో జీహెచ్‌ఎంసీలో అధికారులు ఇప్పటికే 200 బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. వీటికి తోడు మరో 24 బస్తీ దవాఖానాలను పలువురు మంత్రులు ఇవాళ ప్రారంభించనున్నారు. రాష్ట్ర కుటుంబ సంక్షేమశాఖతో కలిసి నగరంలోని నిరుపేదలు అధికంగా నివసించే మురికివాడలు, బస్తీలలో జీహెచ్‌ఎంసీ  బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసింది. వీటిని హోంమంత్రి మహమూద్‌ అలీతో పాటు మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సబితారెడ్డి, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రారంభించనున్నారు.

అంబర్ పేట్ సర్కిల్ లోని మౌలాన ఆజాద్ నగర్ కమ్యునిటీహాల్, ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని సయ్యద్ నగర్ ఎమ్మెల్యే కాలనీలో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాలను మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ సర్కిల్ లోని  పార్సిగుట్ట, ఇందిరానగర్‌ లో రెండు దవాఖానాలను డిప్యూటి స్పీకర్ పద్మారావు ప్రారంభించనున్నారు. ఇక ఖైరతాబాద్‌ సర్కిల్‌ పరిధిలోని బీఎస్‌ మక్త కమ్యూనిటీ హాల్‌ లో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖాన మంత్రి ఈటెల రాజేందర్‌ చేతుల మీదుగా ప్రారంభంకానుంది. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలోని దత్తాత్రేయనగర్‌ బస్తీ దవాఖానాను ఈటెల ఓపెన్‌ చేస్తారు.

చార్మినార్ సర్కిల్  లోని పత్తర్ గట్టి, మలక్ పేట్  సర్కిల్ లోని దారుల్ షపా, చాంద్రాయణగుట్ట పరిధిలోని ఈది బజార్ లో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాలను హోం మంత్రి మహ్మూద్ అలీ ప్రారంభిస్తారు. ముషిరాబాద్, గోషామహాల్‌ నియోజకవర్గాల్లోని రాంనగర్, జవహర్ నగర్, మంగళహాట్ ఈస్ట్ బస్తీ దవాఖానను మంత్రి తలసాని ప్రారంభిస్తారు.  కార్వాన్  నియోజకవర్గంలోని  మరాఠి బస్తీ రోడ్, మెహిదీపట్నంలోని సాబేర్ నగర్ కాలనీ సయ్యద్ అలీ గూడ, సంతోష్ నగర్ లోని తలాప్ కట్టలో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాలను నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభిస్తారు. చార్మినార్‌ సర్కిల్‌ పరిధిలోని రాంనాస్‌ పురతో పాటు గౌలిపుర బస్తీ దవాఖానాలు మేయర్‌ చేతుల మీదుగా ప్రారంభంకానున్నాయి.

ఖైరతాబాద్ సర్కిల్ లోని ముజాహిద్ నగర్, సీతారాంబాగ్, సంతోష్ నగర్ సర్కిల్ లోని పటేల్ నగర్ హాల్, లాల్ దర్వాజ బస్తీ దవాఖానాలను డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్‌ రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభిస్తారు. మూసాపేట్ తో పాటు ఎర్రగడ్డ అవంతినగర్‌, నేరేడ్‌మెట్‌, మల్కాజ్‌గిరి సర్కిల్‌ లోని గౌతంనగర్‌ బస్తీ దవాఖానాలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభిస్తారు. ఇక సరూర్‌ నగర్‌ పరిధిలోని వెంకటేశ్వరకాలనీ బస్తీ దవాఖానను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓపెన్‌ చేస్తారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సంబంధిత పార్లమెంట్, శాసన మండలి, శాసన సభ్యులు, కార్పొరేటర్లు పాల్గొంటారు.

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.