28.6 C
Hyderabad
Wednesday, July 8, 2020

చికెన్ ధ‌ర కిలో రూ.500

కోడికూర‌కి రెక్క‌లొచ్చాయి. రెండు వారాల‌కి  ముందు హైద‌రాబాద్‌లో బోన్ లెన్ చికెన్ ధ‌ర కిలో రూ. 400 ఉండ‌గా, ఈ ఆదివారం ఏకంగా రూ.500కి చేరుకుంది. దీంతో మాంసం ప్రియులు గ‌గ్గోలు పెడుతున్నారు. లాక్‌డౌన్ మొద‌లైన‌ప్పుడు కిలో చికెన్ ధ‌ర కేవ‌లం రూ.50 మాత్ర‌మే ఉండేది. కాని ప్ర‌స్తుతం పౌల్ట్రీ ప్రొడ‌క్ష‌న్ త‌క్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో చికెన్ ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి.

కేవ‌లం బోన్‌లెస్ చికెనే కాదు స్కిన్ లెన్ చికెన్ ధ‌ర కూడా రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. స‌మ్మ‌ర్ వ‌ల‌న ఉత్ప‌త్తి పెద్ద‌గా ఉండ‌డం లేదు. హోట‌ల్స్‌, రెస్టారెంట్స్ కూడా మూత ప‌డ‌డంతో చికెన్ సేల్స్ 60 శాతం ప‌డిపోయాయి. ఈ నేప‌థ్యంలో సప్లై పెద్ద‌గా ఉండ‌డం లేదు. వ‌చ్చే నెలలో వ్యాపారం సాధార‌ణ స్థితికి వ‌స్తుంద‌ని భావిస్తున్నాం. ఆ త‌ర్వాత  ప్ర‌తి రోజు రాష్ట్రంలో 10 ల‌క్ష‌ల కోళ్లు స‌ర‌ఫ‌రాచేస్తాం. ప్ర‌స్తుతానికి  4ల‌క్ష‌లు మాత్ర‌మే స‌ర‌ఫరా చేస్తున్నాం అని స్నేహ ఫార్మ్ చైర్మ‌న్ రామ్ రెడ్డి పేర్కొన్నారు.

ఇక మ‌ట‌న్ విష‌యానికి వ‌స్తే కొద్ది రోజుల క్రితం  కిలో ధ‌ర‌ రూ.1000గా ఉండేది. జీహెచ్ఎంసీలో  మటన్ అధిక ధరలకు  అమ్ముతున్న దుకాణాలపై దాడులు ప్రారంభించిన కిలో సుమారు రూ.700 రూపాయలకు అమ్ముడవుతోంది. మొత్తానికి  లాక్‌డౌన్ ఎఫెక్ట్‌, స‌మ్మ‌ర్ ఈ  రెండు మాంసాహార ప్రియులు నిరాశ‌కి గుర‌వుతున్నారు

- Advertisement -

Latest news

చెట్లును రక్షించకపోతే…. గాలిని కొనుక్కోవాల్సిందే

చెట్లను కాపాడుకోకపోతే, భవిష్యత్తులో గాలిని కూడా కొనుక్కునే రోజులు వచ్చే ప్రమాదముందని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణలోని హరిత శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు. ప్రతి...

Related news

చెట్లును రక్షించకపోతే…. గాలిని కొనుక్కోవాల్సిందే

చెట్లను కాపాడుకోకపోతే, భవిష్యత్తులో గాలిని కూడా కొనుక్కునే రోజులు వచ్చే ప్రమాదముందని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణలోని హరిత శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు. ప్రతి...

తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోం

సొంత గడ్డకు ద్రోహం చేయడమే తెలంగాణ కాంగ్రెస్ నేతల నైజమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విషం...

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...

కరోనా మరణాల సంఖ్య తగ్గించడంపై కేజ్రీవాల్‌ సర్కార్‌ ఫోకస్‌

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. దీంతో కరోనా మృతుల సంఖ్యను తగ్గించడంపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గడిచిన రెండు వారాల్లో చనిపోయిన...