20.3 C
Hyderabad
Tuesday, October 27, 2020

చిన్నారులకు మంత్రి కేటీఆర్ భరోసా..రూ.2లక్షల ఎల్ వోసీ అందజేత

జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలం భూపతిపూర్ కు చెందిన భూపతి-ప్రశాంతి దంపతులకు ఇద్దరు కవలలు జన్మించారు..అయితే పిల్లలిద్దరూ బరువు తక్కువగా ఉండటంతో..వైద్య ఖర్చుల కోసం లక్షల్లో ఖర్చవుతుందని డాక్టర్లు తెలిపారు. దీంతో భూపతి-ప్రశాంతి దంపతులు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ కు ఈ విషయాన్ని తెలియజేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. 

ఈ విషయమై మంత్రి కేటీఆర్ తో ఫోన్ లో మాట్లాడిన సంజయ్ కుమార్ వైద్యఖర్చుల నిమిత్తం రెండు లక్షల ఎల్వోసిని వారికి అందజేశారు. చిన్నారులు వైద్యం పొందుతున్నజగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ తో మాట్లాడిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్య సమస్యపై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ కు, అండగా నిలిచిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కు భూపతి-ప్రశాంతి కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట  వైస్ ఎంపీపీ మహేశ్వర రావు,  సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్ ఉన్నారు.

- Advertisement -

Latest news

Related news

జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు ప్రభుత్వం దసరా కానుక అందజేసింది. అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 840 రెండు పడక...

దేశంలో 79లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతుందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 79లక్షలకు చేరువైంది. గత 24గంటల్లో 45వేల 149కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల...

పాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఈరోజు ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ...