21.4 C
Hyderabad
Friday, October 23, 2020

చెట్లును రక్షించకపోతే…. గాలిని కొనుక్కోవాల్సిందే

చెట్లను కాపాడుకోకపోతే, భవిష్యత్తులో గాలిని కూడా కొనుక్కునే రోజులు వచ్చే ప్రమాదముందని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణలోని హరిత శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు. ప్రతి ఒక్కరు హరిహారం కార్యక్రమంలో పాల్గొన్నాలని కోరారు. హరితహారంతో రాజకీయంగా లాభం ఉండదని, ముందు తరాలకు లాభం చేకూరుతుందని వెల్లడించారు. హరితహారంలో భాగంగా కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం వెదురుగుట్ట గ్రామ శివారులో మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ మొక్కలు నాటారు. 

రాష్ట్రంలో అడవులను 33 శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని వెల్లడించారు. 10 శాతం బడ్జెట్‌ను హరితహారం కార్యక్రమానికి కేటాయించిన ఏకైక సీఎం కేసీఆర్‌ అని చెప్పారు. ఇప్పటివరకు 180 కోట్లకుపైగా మొక్కలు నాటామన్నారు. ఇంతపెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని వెల్లడించారు. గ్రామాల్లో పెట్టిన మొక్కల్లో 85 శాతం మొక్కలు బతకకపోతే సర్పంచ్‌ పదవి పోయేలా పంచాయతీరాజ్‌ చట్టం తెచ్చామన్నారు. అన్ని రకాల రోడ్లుకు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. 

- Advertisement -

Latest news

Related news

రాజ‌శేఖ‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాలి…చిరు ట్వీట్

క‌రోనాతో ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న రాజ‌శేఖ‌ర్‌కు సంబంధించి తాజాగా హెల్త్ బులిటెన్ విడుద‌లైంది.  రాజ‌శేఖ‌ర్  ఆరోగ్యం నిల‌క‌డ‌గానే  ఉంద‌ని, చికిత్స‌కు స్పందిస్తున్నార‌ని వైద్యులు తెలిపారు. అలానే త‌న తండ్రి...

సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా.. ఏడవరోజు మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సప్త ఆశ్వాలను కలిగిన సూర్యప్రభపై శ్రీనివాసుడు వజ్రకవచం ధరించి...

బీహార్‌ లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్‌

బీహార్ లో పోలింగ్‌ దగ్గర పడుతున్న వేళ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్‌ చేసింది. పాట్నాలో మేనిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ..ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందించ‌డమే...

బ్రెజిల్‌ లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ వికటించి వలంటీర్‌ మృతి

కొవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ వికటించి బ్రెజిల్‌ లో ఓ వలంటీరు మృతి చెందాడు. ఈ...