24.2 C
Hyderabad
Friday, January 22, 2021

చోరీ చేయడంలో.. షిఫ్ట్ ఫాలో అవుతున్న దొంగ

పొద్దుగాల తొమ్మిదింటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అంటే అందరూ గవర్నమెంట్ ఉద్యోగుల డ్యూటీ టైమింగ్స్ అని టక్కున చెప్పేస్తరు. కానీ.. ఓ ప్రొఫెషనల్ దొంగ సరిగ్గా తన దొంగతనానికి అదే టైమ్ ని ఎంచుకున్నడు. ఠంచనుగా తొమ్మిదింటికి.. ఇంట్ల నాష్ట చేసి.. ఛాయ్ తాగి డ్యూటీకి వెళ్తున్నట్టే దొంగతనానికి బయల్దేరుతడు. తిరిగి పొద్దూకంగ ఐదు గంటల వరకు ఇంటికి చేరుకుంటడు. స్నానం చేసి ఛాయ్ తాగుకుంట టీవీ చూస్తడు. ఏంటీ నమ్మడం లేదా? మీరు నమ్మినా..నమ్మకపోయినా ఇదే నిజం.

ఈ ముచ్చట స్వయంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ సారే స్వయంగా చెప్పిర్రు. టోలీచౌకీలోని పారామౌంట్ కాలనీలో ఉండే కాజాం అలీ ఖాన్ అలియాస్ కాజూ అలియాస్ సూర్య పదో తరగతి వరకు చదివిండు. ఇంటికి దగ్గర ఉండే ఓ ఫంక్షన్ హాల్లో తండ్రితో కలిసి పనిచేసేటోడు. అయితే.. కాజాం మెల్లగ చెడు అలవాట్లకు మరిగిండు. డబ్బుల కోసం దొంగతనం చేసుడు మొదలుపెట్టిండు. ఆ పైసలతోటి ముంబై, బెంగళూరు, గోవాలకు పోయి మజా చేసుడు అలవాటు చేసుకుండు.

లాక్ డౌన్ కంటే  ముందు కాజాం అలీ 70 చోరీలు చేశాడు. 2015ల జూబ్లీహిల్స్, 2016లో సంగారెడ్డి పోలీసులు కాజాం మీద పీడీ యాక్ట్ ప్రయోగించిర్రు. జైలు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నెలల బయటకొచ్చిండు. ఆగస్టు నెల నుంచి మల్ల చోరీలు చేసుడు మొదలు పెట్టిండు. 4 నెలల్లో సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్, మహబూబ్ నగర్‌లో 16 ఇళ్లలో చోరీలు చేశిండు. కాజాం చోరీ చేసేందుకు ఎవరి సాయం తీసుకోడు. తాళాలు పగలగొట్టే పరికరాలు అండర్ వేర్‌లో దాచి పెట్టుకుంటడు. ఎలక్ట్రికల్ టెస్టర్ మాత్రం అంగి జేబులో పెట్టుకుంటడు. దొంగతనం చేసేతందుకు కాజాం పక్కా టైమింగ్ ఫాలో అయితడు.  పొద్దుగాల 9 గంటలకు ఇంట్లకెల్లి బయటకెళ్తే సాయంత్రం 5 గంటల వరకల్లా ఇంటికి చేరుకుంటడు. ఈ మధ్యనే మల్లొక్కసారి సీపీ సజ్జనార్ చేతికి చిక్కిండు. ప్రస్తుతం పోలీసుల అదుపుల ఉన్నడు.

- Advertisement -

Latest news

Related news

కరోనాను కంట్రోల్ చేయలేక ప్రధాని రిజైన్.. ఎక్కడంటే..

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఎంత గజగజలాడించినా అన్ని దేశాలు ఎంతోకొంత ప్రయత్నం చేస్తూ.. కొంతవరకైనా కట్టడి చేస్తున్నాయి. అయితే ఒక దేశంలో మాత్రం కరోనా వైరస్‌ను నియంత్రించలేక ఏకంగా ప్రధానమంత్రే...

ప్రభాస్ పెళ్లిపై రెబల్ స్టార్ కామెంట్

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్ ఒకరు. పాన్‌ ఇండియా స్టార్‌గా అదరగొడుతున్న ప్రభాస్.. పెళ్లి గురించి ఎప్పుడూ టాపిక్ వచ్చినా అది హాట్ టాపిక్ గానే ఉంటుంది. బాహుబలి...

మహేశ్ కొత్త ఫొటోలు చూశారా?

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. సర్కారు వారి పాట షూటింగ్ కోసం జిమ్ముల్లో కసరత్తులు...

స్ట్రీట్‌కు సుశాంత్ పేరు.. ఎక్కడంటే..

దివంగత బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఓ అరుదైన గౌరవం లభించింది. సుశాంత్ పేరుని ఢిల్లీ ప్రజలు మర్చిపోకుండా ఢిల్లీ మున్సిపల్ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు.