18.8 C
Hyderabad
Saturday, January 16, 2021

జమ్మూకాశ్మీర్‌లో కోనసాగుతున్న డీడీసీ ఎన్నికల పోలింగ్

జమ్మూకాశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడుత  పోలింగ్‌ శనివారం ఉదయం ప్రారంభమైంది. జిల్లా అభివృద్ధి మండళ్లు(డీడీసీ), పంచాయితీ ఉప ఎన్నికలకు నేటి నుంచి పోలింగ్ జరగనుంది.ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత తొలిసారిగా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. దింతో ఎలాంటి అవాంఛనియా ఘటనలు చోటు చేసుకోకుండా కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం ఎనిమిది విడుతల్లో ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర భూభాగంలోని 280 నియోజకవర్గాల్లోని 43 డీడీసీ స్థానాలకు మొదటి దశలో ఎన్నికలు ప్రారంభం కాగా.. పోలింగ్‌ మధ్యాహ్నం 2గంటల వరకు ముగియనుంది. ఎనిమిది దశల్లో జరిగే ఎన్నికలు డిసెంబర్‌ 19తో ముగియనున్నాయి. డిసెంబర్ 22 లెక్కింపు నిర్వహించనున్నారు. ఖాళీగా ఉన్న 234 అర్బన్ లోకల్ బాడీస్ (యుఎల్‌బీ) స్థానాలకు ఉప ఎన్నికలు కూడా ఒకేసారి జరుగుతున్నాయి. కొవిడ్ -19 మార్గదర్శకాలను అమలు చేయడానికి ఆరోగ్య శాఖ నిమగ్నమైందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కేకే శర్మ తెలిపారు. భద్రతతో సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. మొదటి, రెండో దశ పోలింగ్‌లో మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్నాయి. 

- Advertisement -

Latest news

Related news

వాట్సాప్ వెబ్ వాడితే అంతే..

వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఇష్యూలో ఇంకా క్లారిటీ రాకముందే మరో కలకలం రేగింది. గూగుల్ సెర్చ్‌లో వాట్సాప్ వెబ్ యూజర్ల పర్సనల్ నంబర్లు కనపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇండిపెండెంట్ సైబర్...

టీకా ఎవరికి వద్దంటే…

ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ మొదలుకానుంది. అయితే వ్యాక్సిన్‌కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత...

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...

అందరూ కలిసి ఊరికి బర్త్ డే చేశిర్రు

ఇదేం విచిత్రం.. ఎవరైనా మనుషులకు బర్త్ డే చేస్తరు. పైసలున్నోళ్లయితే.. పెంచుకునే కుక్కపిల్లలకు, పిల్లి పిల్లలకు బర్త్ డేలు చేస్తరు. కానీ.. ఊరికి బర్త్ డే చేసుడేంది అని ఆలోచిస్తున్నరా?...