19.5 C
Hyderabad
Friday, November 27, 2020

జవహర్‌నగర్‌లో వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ఇన్నాళ్లు గుట్టలను తలపిస్తూ తీవ్రమైన దుర్గంధంతో ప్రజలను అతలాకుతలం చేసిన చెత్తనే ఇప్పుడు విద్యుత్ తయారీకి ఉపయోగపడుతున్నది. ఇందుకు హైదరాబాద్‌ నగర శివారు జవహర్ నగర్ వేదికైంది. జీహెచ్ఎంసీ, రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ ఆధ్వర్యంలో వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంటును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులో భాగంగా వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంటు ఏర్పాటుపై జీహెచ్ఎంసీ, రాంకీ ఎన్విరో మధ్య ఒప్పందం ఉంది. ఇందులో భాగంగా మొదటి దశలో 19.8 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంటును ఏర్పాటు చేశారు. ఇందులో పర్యావరణానికి ఎటువంటి నష్టం జరుగకుండా బెల్జియంకు చెందిన రెఫ్యూజ్ డీరైవ్డ్ ఫ్యూల్ టెక్నాలజీతో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు. దక్షిణ భారత దేశంలోనే వ్యర్థాలతో కరెంటు ఉత్పత్తి చేసే మొదటి ప్లాంటు ఇదే కావడం విశేషం. 

- Advertisement -

Latest news

Related news

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....

నిఖార్సయిన హిందుత్వానికి నిర్వచనం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప హిందువు. సీఎం కేసీఆర్‌ చేసే యజ్ఞయాగాది క్రతువులు తాను ఎలాంటివారో చెప్పక్కనే చెబుతాయి. కేసీఆర్‌ చేపట్టిన ఏ పనిలోనైనా...