18 C
Hyderabad
Friday, November 27, 2020

జవాన్ల అమరత్వంతో శోకిస్తున్న తెలుగు రాష్ట్రాలు

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్ లో నిజామాబాద్ జిల్లాకు చెందిన ర్యాడ మహేష్ వీరమరణం పొందారు. దొంగచాటుగా దేశంలోకి చొరబడేందుకు దొంగదెబ్బతీసిన ఉగ్రవాది చేతిలో జవాన్ మహేష్ అమరడయ్యాడు. దీంతో మహేష్ సొంతూరు నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లిలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. మహేశ్‌ మరణవార్త విన్న తల్లిదండ్రులు.. అర్థాంగి సుహాసిని ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బార్డర్ లో భరతమాత సేవలో ఉన్న మహేష్ ..ఇక లేరు అన్నవార్తతో కన్నీరుమున్నీరు విలపిస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన సుహాసినిని.. మహేశ్‌ ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. నవంబర్ 5న సుహాసిని పుట్టినరోజు. ఈ సందర్భంగా వీడియో కాల్ ద్వారా మహేశ్ భార్యకు శుభాకాంక్షలు చెప్పాడు. ఈ నెల 21న మహేశ్ పుట్టినరోజు ఉండటంతో ఇంటికి వస్తానని భార్యకు మాటిచ్చాడు. అంతలోనే ఉగ్రవాదుల కాల్పుల్లో మహేశ్ వీర మరణం పొందాడన్న వార్తతో సుహాసినిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. మహేశ్ వయసు 26 ఏండ్లు. 21 ఏండ్లకే సైన్యంలో జవాన్గా చేరాడు. ఆయన తల్లిదండ్రులు గంగుమల్లు, రాజుభాయ్లకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కొడుకు భూమేశ్ గల్ఫ్ లో ఉన్నారు.

వీర జవాన్ మహేశ్‌కు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నివాళులర్పించారు. కోమన్‌పల్లిలో ఆయన తల్లిదండ్రులను ఓదార్చారు. నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయలతో కలిసి ధైర్యం చెప్పారు. మహేశ్‌ ప్రాణత్యాగాన్ని గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంటుందని మహేశ్‌ కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు.

అటు మహేశ్‌ ప్రాణత్యాగం భారతీయలందరికీ స్ఫూర్తిదాయకమన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీర జవాన్‌ కుటుంబానికి తెలంగాణ జాతి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మహేశ్‌ కుటుంబసభ్యులకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...