27.2 C
Hyderabad
Friday, December 4, 2020

జీవితంలో ఇలాంటి విలయం ఎప్పుడూ చూడలేదు: దీదీ

కోల్‌కతా: తన జీవితంలో ఇప్పటివరకు ఇలాంటి ప్రకృతి ప్రకోపాన్ని చూడలేదని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. అంఫాన్‌ తుఫాన్‌ వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు 72 మంది మరణించారని ఆమె వెల్లడించారు. తుఫాన్‌ సృష్టించిన విలయాన్ని పరిశీలించడానికి రాష్ట్రంలో పర్యటించాలని ప్రధాని మోదీని తానే స్వయంగా కోరుతానని చెప్పారు. చాలా మంది క్షతగాత్రులయ్యారని, తుఫాను వల్ల మరణించినవారి కుటుంబాలకు రూ.2.5 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తామని ఆమె ప్రకటించారు. 

అంఫాన్‌ తుఫాన్‌ పశ్చిబెంగాల్‌లో బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలులు, వర్షాల వల్ల వేలాది ఇండ్లు ధ్వంసమయ్యాయి. బెంగాల్‌ తీరం వెంబడి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతోపాటు కుండపోత వర్షం కురియడంతో కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయం జలదిగ్భందమయ్యింది. రన్‌వే, హాంగర్లు పూర్తిగా నీటమునడగంతోపాటు, బలమైన ఈదురు గాలుతో విమానాశ్రయంలోని కొన్ని నిర్మాణాలు విరిగిపడ్డాయి. దీంతో విమనాలు ధ్వంసమయ్యాయి

- Advertisement -

Latest news

Related news

బొంతు శ్రీదేవి విజయం – కొనసాగుతున్న కారు హవా

గ్రేటర్ ఫలితాల్లో కారు టాప్ గేరులో దూసుకుపోతోంది. అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్‌ జోరు చూపిస్తోంది. ఇప్పటికే 29 చోట్ల విజయం సాధించిన గులాబీ...

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.