24.3 C
Hyderabad
Wednesday, November 25, 2020

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది. డిసెంబర్‌ 1న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించి..4వ తేదీన ఓట్లు లెక్కించనున్నారు.  అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు.  కాగా బుధవారం నుంచి 20వ తేదీ వరకు మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించనున్నారు. 21న నామినేషన్లు పరిశీలిస్తారు. 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉప సంహరణకు అవకాశం కల్పించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు.

డిసెంబర్‌ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్టు  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి తెలిపారు. కోవిడ్‌ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓటర్లు మాస్క్ ధరించడంతో పాటు సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలన్నారు. ఇక ఈసారి డివిజన్ల పునర్‌ వ్యవస్థీకరణ లేదని స్పష్టంచేశారు. 2016 నాటి రిజర్వేషన్లనే ఈసారి కూడా అమలు చేస్తున్నామని ఎస్ఈసీ పార్థసారథి చెప్పారు. బ్యాలెట్‌ పేపర్‌ ద్వారానే జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహిస్తామన్నారు. తెలుపు రంగులో బ్యాలెట్‌ పేపర్లు ఉంటాయన్నారు.  

ఆన్‌లైన్‌ ద్వారా కూడా నామినేషన్లు  స్వీకరిచనున్నట్లు  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి తెలిపారు. ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేషన్‌ డిపాజిట్‌గా  2,500, జనరల్‌ అభ్యర్థులకు నామినేషన్‌ డిపాజిట్‌ గా 5,000 రూపాయలను నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం వార్డులు 150 ఉండగా..జనరల్‌ కు  75, మహిళలకు 75 వార్డులు కేటాయించారు.  ఇందులో బీసీలకు 50 వార్డులు, ఎస్సీలకు 10 వార్డులు, ఎస్టీలకు 2 వార్డులు కేటాయించారు. ఇక మేయర్‌ స్థానం జనరల్‌ మహిళకు కేటాయించారు.

కార్పొరేటర్‌ అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ. 5లక్షలు మించి పెట్టరాదని ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి తెలిపారు. ఫలితాల వచ్చాక 45 రోజుల్లో ఎన్నికల ఖర్చులు చూపాలన్నారు. ఖర్చు చూపని అభ్యర్థులపై మూడేళ్ల అనర్హత వేటు వేస్తామని హెచ్చరించారు. ఇక ఓటర్లు ఎస్‌ఈసీ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ ద్వారా ఓటర్‌ స్లిప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పార్థసారధి తెలిపారు.

- Advertisement -

Latest news

Related news

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి పటేల్‌ చేసిన కృషిని కొనియాడారు. ఆయన చాలా కాలంపాటు ప్రజా...