హైదరాబాద్‌ను విశ్వనగరం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు మంత్రి కేటీఆర్. 429 ఏళ్ల కింద ఏర్పడ్డ చారిత్రక నగరం హైదరాబాద్ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం రాకముందే హైదరాబాద్ నాలుగు మున్సిపాలిటీలుగా ఉందన్నారు. శాసనసభలో జీహెచ్ఎంసీ సవరణ బిల్లును మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు. జీహెచ్ఎంసీ చట్టంలో ముఖ్యమైన ఐదు సవరణలు చేస్తున్నామన్నారు. 2015 లోనే 50 శాతం స్థానాలను మహిళలకే ఇచ్చేలా జీవో తెచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ చట్టం ద్వారా 50 శాతం మహిళా రిజర్వేషన్ కల్పిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో 5 నుంచి 6 శాతానికి గ్రీన్ కవర్ పెరిగిందని నివేదికలు చెప్తున్నాయన్నారు. తెలంగాణ పట్టణాలు హరితవనాలుగా మారాయన్నారు.