18.8 C
Hyderabad
Saturday, January 16, 2021

జీహెచ్‌ఎంసీలో ప్రారంభమైన ఎన్నికల పోలింగ్

జీహెచ్‌ఎంసీలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 150 డివిజన్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కరోనా దృష్ట్యా.. బ్యాలెట్ పద్ధతిలో ఈసీ ఎన్నికలు నిర్వహిస్తోంది. గ్రేటర్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 74 లక్షల 67 వేల 256 మంది. ఇందులో పురుషులు 38 లక్షల 89 వేల 637 మంది కాగా స్త్రీలు 35 లక్షల 76 వేల941 మంది. ఇతరులు 678 మంది ఉన్నారు. మొత్తం 150 డివిజన్లకు గాను 1122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీల్లో టీఆర్ఎస్ 150 స్థానాలకు పోటీ చేస్తుండగా.. బీజేపీ 149, కాంగ్రెస్ 146, ఎంఐఎం 51 స్థానాల్లో పోటీ చేస్తోంది. మైలార్ దేవ్ పల్లిలో అత్యధిక మంది ఓటర్లుండగా.. అత్యల్ప ఓటర్లు రామచంద్రాపురంలో ఉన్నారు. జంగంమెట్ డివిజన్ లో అత్యధికంగా 20 మంది బరిలో ఉండగా.. ఐదు డివిజన్లలో మాత్రం కేవలం ముగ్గురు అభ్యర్థులే పోటీ చేస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

రిస్క్ చేయొద్దు..

భారత్‌ ఓపికకు పరీక్ష పెట్టి రిస్క్ చేయొద్దని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె శత్రు దేశాలను హెచ్చరించారు. నార్త్ బోర్డర్ లో జరుగుతున్న కుట్రను సమర్ధవంతంగా తిప్పికొట్టామని అన్నారు....

వాట్సాప్ వెబ్ వాడితే అంతే..

వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఇష్యూలో ఇంకా క్లారిటీ రాకముందే మరో కలకలం రేగింది. గూగుల్ సెర్చ్‌లో వాట్సాప్ వెబ్ యూజర్ల పర్సనల్ నంబర్లు కనపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇండిపెండెంట్ సైబర్...

టీకా ఎవరికి వద్దంటే…

ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ మొదలుకానుంది. అయితే వ్యాక్సిన్‌కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత...

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...