21.2 C
Hyderabad
Monday, November 23, 2020

జీ20 గ్లోబల్‌ స్మార్ట్‌సిటీ కూటమిలో భాగ్యనగరం

భద్రత, పాలన, భౌగోళిక అంశాల పరంగా ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు మరో ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. ప్రపంచ ఆర్థిక వేదిక.. డబ్ల్యూఈఎఫ్‌ చేపట్టిన జీ-20 గ్లోబల్ స్టార్‌ సిటీస్‌ అలయెన్స్‌ లో మార్గదర్శక నగరం హోదాలో చేరింది. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ సిటీల అభివృద్ధికి డబ్ల్యూఈఫ్‌ చేపట్టిన రోడ్ మ్యాప్‌ ను ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు 36 నగరాలను ఎంపిక చేశారు. ఆరు ఖండాల్లోని 22 దేశాల నుంచి ఈ నగరాలను ఎంపిక చేయగా.. భారత్ నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, ఫరీదాబాద్‌, ఇండోర్‌లకు మాత్రమే చోటు దక్కింది. లండన్, మాస్కో, టోరంటో, బ్రెసీలియా, దుబాయ్, మెల్ బోర్న్ వంటి ప్రపంచస్థాయి నగరాలతో కలిసి హైదరాబాద్‌ పని చేయనుంది.

మంగళవారం జరిగిన స్మార్ట్ సిటీ ఎక్స్‌పో వరల్డ్ కాంగ్రెస్ సమావేశంలో ఈ నగరాలు మార్గదర్శక ప్రణాళికపై కసరత్తు మొదలుపెట్టాయి. సమావేశంలో రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. అత్యాధునిక సాంకేతిక సాయంతో పౌరుల జీవితాల్లో సానుకూల మార్పులు తెచ్చే విధానాల రూపకల్పనకు జీ20 దేశాలతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా మెట్రో నగరాల్లో విపరీతంగా పెరిగిపోతున్న జనాభాకు తగిన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వాలకు తలనొప్పిగా మారుతున్నది. ముఖ్యంగా భద్రత, పౌరుల గోప్యత, సైబర్ సెక్యూరిటీ వంటి విషయాల్లో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ సమస్యలు మరింత జఠిలంగా మారాయి. వీటిని అధికమించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించాలనే అంశంపై విధానాల రూపకల్పనకు జీ20 గ్లోబల్‌ స్మార్ట్ సిటీస్ అలయెన్స్‌ ను ఏర్పాటు చేశారు. ఈ బృందంలో చేరిన నగరాల్లో డబ్ల్యూఈఎఫ్‌ ప్రణాళికలను ముందుగా అమలు చేసి చూస్తారు. ఫలితాలను అధ్యయనం చేసిన తర్వాత లోపాలుంటే మరింత మెరుగుపర్చి ప్రపంచంలోని ఇతర నగరాలకు విస్తరిస్తారు.

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...