23.8 C
Hyderabad
Thursday, October 1, 2020

జూరాలకు కృష్ణమ్మ పరుగులు

కర్ణాటకలోని నారాయణపుర జలాశయం నుంచి అధికారులు 45 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి స్థిరంగా వరద కొనసాగుతుండగా.. 40 వేల క్యూసెక్కుల జలాలు విడుదలవుతున్నాయి. దీంతో నారాయణపుర నుంచి ఏడు గేట్ల ద్వారా కృష్ణా జలాలు తెలుగు రాష్ర్టాలకు పరుగులు పెడుతున్నాయి.  రాత్రి వరకు ఈ జలాలు జూరాలకు చేరుకునే అవకాశం ఉన్నదని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. జలాలు జూరాలను తాకగానే మొదటగా విద్యుదుత్పత్తి ద్వారా, తర్వాత గేట్ల ద్వారా దిగువకు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు చెపుతున్నారు.

మరోవైపు తుంగభద్రలో ఇన్‌ఫ్లో 18వేల క్యూసెక్కుల దాకా ఉండగా.. నీటి నిల్వ 17 టీఎంసీలకు చేరుకున్నది. గోదావరిలోని శ్రీరాంసాగర్‌కు వరద తగ్గింది. పదకొండు వేల క్యూసెక్కుల నుంచి సోమవారం ఉదయానికి ఆరువేల క్యూసెక్కులకు పరిమితమైంది. కడెం, ఎల్లంపల్లికి స్వల్పంగానే వరద కొనసాగుతున్నది. ధవళేశ్వరం వద్ద కూడా లక్ష క్యూసెక్కుల పైచిలుకు నుంచి 93 వేల క్యూసెక్కులకు పరిమితమైంది.

రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి సోమవారం అధికారులు ఎల్‌ఎండీకి నీటిని విడుదల చేశారు. మధ్యాహ్నం తూముల ద్వారా, సాయంత్రం గేట్ల ద్వారా నీటిని వదిలారు. మొదట 8 గేట్ల ద్వారా సుమారు 4 వేల క్యూసెక్కులు విడుదల చేయగా, సాయంత్రం వరకు 10వేల 321 క్యూసెక్కులకు పెంచారు. నిన్న సాయంత్రానికి జలాలు ఎల్‌ఎండీకి చేరుకొన్నాయి. ఎస్సారార్‌ నుంచి 5 టీఎంసీల నీటిని ఎల్‌ఎండీకి తరలించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈనెల 15 తర్వాత ఎల్‌ఎండీ దిగువ ఆయకట్టుకు వానకాలం సాగు కోసం నీటిని తరలించేందుకు చర్య లు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

Latest news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

Related news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

లైంగిక వేధింపుల కేసులో పోలీసుల ముందుకు అనురాగ్‌ కశ్యప్‌

లైంగిక వేధింపుల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ఫిల్మ్ డైర‌క్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ ..  ముంబైలోని వెర్సోవా పోలీసుల ముందు హాజరయ్యారు. న‌టి పాయల్ ఘోష్  ఆరోపణలతో పలు విషయాలపై...

రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 75వ వసంతం లోకి అడుగుపెట్టిన సందర్భంగా సీఏం కేసీఆర్ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు....

దేశంలో 24 గంటల్లో 86,821 కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య లక్షకు చేరువైంది. నిన్నటికి నిన్న 1వెయ్యి 181 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 98వేల678...