23.4 C
Hyderabad
Monday, November 23, 2020

టీఆర్ఎస్ గ్రేటర్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థులను ఖరారు చేసే పనిపై దృష్టి పెట్టాయి. ఈ విషయంలో మిగతా పార్టీల కంటే టీఆర్ఎస్ అందరి కంటే ముందు నిలిచింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసే తొలి జాబితాను టీఆర్‌ఎస్‌ విడుదల చేసింది. 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ తొలి జాబితా విడుదల చేసింది. అంతకు ముందు సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ ప్రజప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో పార్టీ వ్యూహాన్ని వివరించారు. ప్రతిపక్షాలను విమర్శలను ఎలా తిప్పికొట్టాలో దిశానిర్దేశం చేశారు.  

టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ అభ్యర్థుల జాబితా ప్రకారం కాప్రా-స్వర్ణరాజ్‌, నాగోల్-సంగీత ప్రశాంత్‌ గౌడ్‌, మన్సూరాబాద్-కొప్పుల విఠల్‌రెడ్డి, హయత్‌నగర్‌-సామ  తిరుమల్‌రెడ్డి, బీఎన్‌ రెడ్డి నగర్-ముద్దగోని లక్ష్మీప్రసన్నగౌడ్‌, వనస్థలిపురం-జిట్టా రాజశేఖర్‌ రెడ్డి, హస్తినాపురం-రమావత్‌ పద్మానాయక్‌, చంపాపేట-సామ రమణారెడ్డి, లింగోజిగూడ-ముద్రబోయిన శ్రీనివాసరావుకు కేటాయించారు.

సరూర్‌నగర్ -అనితా దయాకర్‌ రెడ్డి, ఆర్‌ కే పురం-విజయభారతి అరవింద్‌ శర్మ, కొత్తపేట-జీవీ సాగర్‌రెడ్డి, చైతన్యపురి-జిన్నారం విఠల్‌ రెడ్డి, గడ్డిఅన్నారం-భవాని ప్రవీణ్‌ కుమార్, సైదాబాద్‌-సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి, ముసారాంబాగ్‌-తీగల సునరితారెడ్డి, ఓల్డ్‌ మలక్‌ పేట-పగిళ్ల షాలిని, అక్బర్‌ బాగ్-శ్రీధర్‌రెడ్డి మదికుంట , అజంపురా-బాబూరావు, చవాని-ఎండీ షౌకత్‌ అలీ, డబీర్‌పురా-ఎండీ శాబీర్‌, రెయిన్‌ బజార్‌-అబ్దుల్‌ జవీద్‌, పత్తర్‌గట్టి-అక్తర్‌ మొహినుద్దీన్‌, మొగల్‌పురా నుంచి సరిత, తలాబ్‌ చంచలం-మెహరున్నీసా, గౌలిపురా-బొడ్డు సరిత, లలితాబాగ్-రాఘవేంద్రరాజుకు టీఆర్ఎస్ టికెట్ కేటాయించారు.

కురుమగూడ-మైల్‌కోల్‌ నవితా యాదవ్‌, ఐఎస్‌సదన్‌-స్వప్నసుందర్‌రెడ్డి సంతోష్‌నగర్‌-శ్రీనివాస్‌రావు, రియాసత్‌ నగర్‌-సంతోష్‌కు మార్, కంచన్‌బాగ్-ఆకుల వసంత, బార్కాస్‌-సరిత, చాంద్రాయణగుట్ట-జుర్కి సంతోష్‌రాణి, ఉప్పుగూడ-శోభారాం రెడ్డి, జంగంమెట్‌-స్వరూపరాంసింగ్‌ నాయక్‌ ను టీఆర్ఎస్ ప్రకటించింది. అటు ఫలక్‌ నుమా-గిరిధర్‌ నాయక్‌, నవాబ్‌ సాహెబ్‌ కుంట-సమీనాబేగం, శాలిబండ-రాధాకృష్ణ, ఘాన్సీబజార్‌-ఇషిత, గోషామహల్‌-ముఖేష్‌సింగ్‌, పురానాపూల్-లక్ష్మణ్‌ రావు , దూద్‌ బౌలి-షబానా అంజుమ్‌ పోటీలో ఉన్నరు.

కిషన్‌ బాగ్‌-మహ్మద్‌ షకీల్‌ అహ్మద్‌, జియాగూడ-ఎ. కృష్ణ, మంగళ్‌ హాట్‌-పరమేశ్వరిసింగ్‌, దత్తాత్రేయనగర్‌-ఎండీ సలీమ్‌, కార్వాన్‌-ముత్యాల భాస్కర్‌, లంగర్‌ హౌస్‌-పార్వతమ్మ యాదవ్‌, గోల్కొండ-అసిఫాఖాన్‌,టోలిచౌకి-నాగజ్యోతి, నానల్‌ నగర్‌-ఎస్‌కే అజార్‌, మెహిదీపట్నం-సంతోష్‌ కుమార్‌ హింగోలేకర్‌, గుడిమల్కాపూర్‌-బంగారి ప్రకాష్‌, అసిఫ్‌ నగర్‌-మల్లెపూల సాయిశిరీష, విజయ్‌ నగర్‌ కాలనీ-స్వరూపరాణి, అహ్మద్‌ నగర్‌-సారిక, రెడ్‌ హిల్స్‌-ప్రియాంక గౌడ్‌, మల్లేపల్లి – మెట్టు పద్మావతి, జాంబాగ్ – ఆనంద్ గౌడ్, గన్ ఫౌండ్రి – మమతా ను నిర్ణయించారు. రాం నగర్ – శ్రీనివాస్ రెడ్డి, గాంధీ నగర్ – ముఠా పద్మా నరేశ్ బరిలో నిలిచారు.

ఖైరతాబాద్ – పి. విజయా రెడ్డి,  వెంకటేశ్వర కాలనీ – మన్నె కవితా రెడ్డి బంజారాహిల్స్‌-విజయలక్ష్మి గద్వాల, జూబ్లీహిల్స్ – కాజా సూర్యనారాయణ సోమాజిగూడ – వనం సంగీతా యాదవ్, మీర్ పేట – శేషుకుమారి, సనత్ నగర్ – కొలన్‌ లక్ష్మి, ఎర్రగడ్డ – పల్లవి మహేందర్ యాదవ్, బోరబండ – బాబా ఫసియుద్దీన్, కొండాపూర్ – షేక్ హమీద్ పటేల్, గచ్చిబౌలి – సాయిబాబా మాదాపూర్ – జగదీశ్వర్ గౌడ్  పోటీలో ఉన్నారు.

మియాపూర్ – ఉప్పలపాటి శ్రీకాంత్, హఫీజ్ పేట్ – జగదీశ్వర్, భారతి నగర్ – సింధు ఆదర్శ రెడ్డి,  ఆర్‌ సీపురం – పుష్పా నగేశ్ కురుమ, పటాన్ చెరు – మెట్టు కుమార్ యాదవ్ , కేపీహెచ్‌బీ కాలనీ – మందడి శ్రీనివాసరావు, బాలాజీ నగర్ – శిరీష బాపూరావు, అల్లాపూర్ – సబీహా బేగం , మూసాపేట్ – తూము శ్రవణ్ కుమార్, ఫతే నగర్ – సతీష్ గౌడ్, ఫతే నగర్ – సతీష్ గౌడ్, ఓల్డ్ బోయిన్‌పల్లి – నర్సింహ యాదవ్, ఆల్విన్ కాలనీ – వెంకటేష్‌ గౌడ్, గాజుల రామారం – రావుల శేషగిరి, జగద్గిరిగుట్ట – కొలుకుల జగన్,  రంగారెడ్డి నగర్ – విజయ్ శేఖర్ గౌడ్, చింతల్ – రషీదా బేగం, సూరారం – మంత్రి సత్యనారాయణ, సుభాష్ నగర్ – ఆదిలక్ష్మి గుడిమెట్ల, కుత్బుల్లాపూర్-కూన పారిజాత గౌడ్, జీడిమెట్ల – పద్మా ప్రతాప్ గౌడ్, మచ్చ బొల్లారం – రాజ్ జితేంద్రనాథ్ , అల్వాల్ – చింతల విజయశాంతి, వెంకటాపురం – సబితా కిశోర్, మల్కాజ్ గిరి – జగదీశ్ గౌడ్, సీతాఫల్ మండి – సామల హేమ, బన్సిలాల్ పేట్ – కుర్మ హేమలత, రాంగోపాల్ పేట్ – అరుణ, మోండా మార్కెట్-ఆకుల రూపకు కేటాయించారు.

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...