17.7 C
Hyderabad
Wednesday, November 25, 2020

డబుల్ డెక్కర్ బస్సులను గుర్తుచేస్తూ కేటీఆర్ ట్వీట్

ఒక‌ప్పుడు భాగ్యనగ‌రంలో డ‌బుల్ డెక్కర్ బ‌స్సులు ప‌రుగెడుతుంటే చూడ‌ముచ్చటగా ఉండేది. నిజాం కాలం‌లో ప్రారంభ‌మైన డ‌బుల్ డెక్కర్ బ‌స్సులు కాల‌క్రమేణా క‌నుమరుగై పోయాయి. అయితే షాకీర్ హుస్సేన్ అనే యువ‌కుడు డ‌బుల్ డెక్కర్ బ‌స్సుల‌ను గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ఒక‌ప్పుడు డ‌బుల్ డెక్కర్ బ‌స్సు సికింద్రాబాద్ నుంచి జూపార్క్ మార్గంలో 7 నంబ‌ర్‌ తో న‌డిచేవని.. ప్రయాణికులు లేదా టూరిస్టుల కోసం వాటిని మళ్లీ తీసుకురావాల‌ని కేటీఆర్‌ను కోరారు. ఈ ట్వీట్‌ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. డ‌బుల్ డెక్కర్ బ‌స్సుల గురించి చాలా జ్ఞాప‌కాలు గుర్తుకు వ‌స్తున్నాయ‌న్నారు. ఆ బ‌స్సుల‌ను ఎందుకు ఆపేశారో త‌న‌కు క‌చ్చితంగా తెలియ‌ద‌న్నారు. డ‌బుల్ డెక్కర్ బ‌స్సుల‌ను మ‌ళ్లీ రోడ్లపైకి తీసుకువ‌చ్చేందుకు ఏమైనా అవ‌కాశం ఉందా? అంటూ ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌ను కేటీఆర్ అడిగారు.

- Advertisement -

Latest news

Related news

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి పటేల్‌ చేసిన కృషిని కొనియాడారు. ఆయన చాలా కాలంపాటు ప్రజా...

అసోంవాసులను భయపెడుతున్న చిరుతలు

చిరుతలు అసోంవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నాపంలోని తేజ్పూర్‌ యునివర్సిటీ సమీపంలో పట్టపగలే ప్రజలపై దాడికి పాల్పడడం కలకలం రేపుతోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా పులి జనం మీదకు విరుచుకుపడడంతొ...