17.6 C
Hyderabad
Saturday, November 28, 2020

డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఉన్నత విద్యామండలి. నేటి నుంచి ఆన్లైన్ ద్వారా దోస్త్ వెబ్ సైట్ లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని దోస్త్ కన్వీనర్ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్ లింబాద్రి తెలిపారు.

జూలై 1 నుంచి 14 వరకు మొదటి విడద దోస్త్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి ప్రకటించారు. జూలై 6 నుంచి 15 వరకు మొదటి విడత వెబ్‌ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జూలై 22న మొదటి విడత సీట్లను కేటాయిస్తామని వెల్లడించారు. జూలై 23 నుంచి 27 వరకు విద్యార్థులు సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాలని సూచించారు.  

జూలై 23 నుంచి 29 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని, 30వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఆగస్టు 7న రెండో విడత డిగ్రీ సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఆగస్టు 8 నుంచి 13 వరకు మూడో విడత దోస్త్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆగస్టు 8 నుంచి 14వ తేదీ వరకు మూడో విడత వెబ్‌ ఆప్షన్ల నమోదు చేసుకోవాలన్నారు. ఆగస్టు 13న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు. సెప్టెంబర్‌ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ప్రకటించారు.  

సాధారణంగా ప్రతి ఏడాది ఇంటర్‌ ఫలితాలు వెలువడిన రోజే దోస్త్‌ ప్రకటన విడుదల చేస్తారు. అయితే కరోనా మహమ్మారి వల్ల ఈసారి ఆలస్యమయ్యింది. రాష్ట్రంలోని సుమారు వెయ్యికిపైగా డిగ్రీ కాలేజీల్లో 200 కోర్సుల్లో సీట్లను దోస్త్‌ ద్వారా భర్తీ చేస్తారు.

- Advertisement -

Latest news

Related news

తెలంగాణ ఆత్మగౌరవానికి ఢిల్లీ అమర్యాద

తెలంగాణ ప్రజలను ఢిల్లీలోని మోడీ సర్కార్‌ ఘోరంగా అగౌరవ పరిచింది. ఆత్మగౌరవం కోసమే ఆరు దశాబ్ధాలపాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ పట్ల కించపరిచేలా వ్యవహరించింది. ప్రధాని మోడీ హైదరాబాద్...

ఇవాళ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగే ఈ...

ఎన్నికల ప్రచారంలో కల్వకుంట్ల కవిత జోరు

పేదల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు రూపొందించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దూరదృష్టితో, చక్కటి ప్రణాళికతో.. కేంద్రం నుంచి ఎలాంటి...

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...