గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

ఈ ఎన్నికల్లో బోరబండ నుంచి పోటీ చేసిన డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ రెండోసారి గెలిచారు. 2015లో బోరబండ నుంచి గెలిచి డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు చేపట్టిన బాబా.. వరుసగా రెండోసారి గెలుపొందారు. ప్రస్తుతం తెరాస 74, బీజేపీ 15, ఎంఐఎం 33 స్థానాల్లో ముందజలో ఉన్నాయి.