29.8 C
Hyderabad
Tuesday, January 26, 2021

డ్రై డే.. పది వారాల పాటు కొనసాగించండి : కేటీఆర్‌

హైదరాబాద్‌ : తెలంగాణలో సరికొత్త కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ప్రతి ఆదివారం డ్రై డే పాటించి.. ప్రతి పట్టణం, ప్రతి గ్రామంతో పాటు ఇళ్లను పరిశుభ్రం చేసుకోవాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. సీజనల్‌ వ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 10 నిమిషాల పాటు ప్రజలు తమ ఇండ్లను, పరిసరాలను శుభ్రపరుచుకోవాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి మే 10వ తేదీన(ఆదివారం) శ్రీకారం చుట్టారు. 

ప్రగతి భవన్‌లో డ్రై డే కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ ఆదివారం పాల్గొన్నారు. గార్డెన్‌లో పూల కుండీలతో పాటు పాత్రల్లో నిండిన నీటిని మంత్రి శుభ్రపరిచారు. డ్రై డే కార్యక్రమం పది వారాల పాటు కొనసాగించాలని ప్రజలను కేటీఆర్‌ కోరారు. సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా కలిసి రావాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. 

- Advertisement -

Latest news

Related news

59 టాప్ చైనా యాప్‌ల‌పై శాశ్వత నిషేధం!

టిక్‌టాక్‌, ప‌బ్‌జీ, వీచాట్ స‌హా 59 టాప్ చైనా యాప్‌ల‌పై కేంద్ర ఎల‌క్ట్రానిక్స్, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ‌ శాశ్వత నిషేధం విధించిన‌ట్లు సమాచారం. డేటా నిబంధనలు పాటించడం లేదని...

ఇద్దరు సీనియర్ అధికారులపై ఎస్ఈసీ బదిలీ వేటు

ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన పంచాయతీరాజ్‌ శాఖ అధికారులపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కొరడా ఝలిపించారు. సీనియర్‌ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌పై బదిలీ...

లద్ధాఖ్‌లో రిపబ్లిక్ డే.. ఫోటోస్ చూశారా?

దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో పరేడ్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇదే టైంలో గడ్డ కట్టే మైనస్ డిగ్రీల చలిలో లద్ధాఖ్ లో కూడా...

మోదీ తలపాగా వెరీ స్పెషల్.. ఎవరిచ్చారంటే..

భారత 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో  ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన తలపాగా(టర్బన్) అందర్నీ విశేషంగా ఆకర్షించింది. నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు శ్రధ్ధాంజలి ఘటించే సమయంలోను.. ఆ...