18.2 C
Hyderabad
Sunday, January 17, 2021

ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం

ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌కు దేశ రాజధాని ఢిల్లీలో అధికారిక కార్యాలయం ఏర్పాటు కానున్నది. టీఆర్‌ఎస్‌ పార్టీ భవన నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్రం ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు మేరకు కేంద్ర ప్రభుత్వ హౌజింగ్‌, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిప్యూటీ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ దీన్‌దయాల్‌ టీఆర్ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఢిల్లీలో స్థలం కేటాయింపు ప్రక్రియ ముగిసినందున త్వరలోనే టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసి త్వరితగతిన నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌  ప్రకటించారు..

ఒకప్పుడు ఢిల్లీలో తెలంగాణ ప్రాంతానికి ప్రతీకగా హైదరాబాద్‌ హౌజ్ ఉండేది. ప్రతిష్టాత్మకమైన ఈ రాజ ప్రసాదం తదనంతర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోయింది. హైదరాబాద్‌ హౌజ్‌ ఆనాటి చరిత్రకు ప్రతీక అయితే.. ఇప్పుడు ఏర్పాటు కానున్న టీఆర్‌ఎస్‌ భవన్‌ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక. తెలంగాణ ఉద్యమ పోరాటానికి.. ఆక్షాంక్షల సాఫల్యానికి అది సంకేతం. దేశంలోని అనేక ప్రాంతాల్లో అస్తిత్వ ఉద్యమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో వెలిసే టీఆర్‌ఎస్‌ భవన్‌ నిలువెత్తు విజయంగా నిలిచి వారికి ఆదర్శంగా మారనున్నది. సంకల్ప శుద్ది, ఆత్మ స్థైర్యం సుదీర్ఘ పోరాటం చేసే నేర్పరితనం ఉంటే చిన్న ప్రాంతాలు కూడా ప్రాబల్య ఆధిపత్య వాదుల ఆగడాలను ధిక్కరించి గెలవచ్చనే స్పూర్తిని దేశవాసులకు అందించనున్నది

తెలంగాణ వస్తే ఏమోస్తుంది అని ప్రశ్నించిన సందేహ పక్షులకు ఢిల్లీలో ఏర్పాటు కాబోయే టీఆర్‌ఎస్‌ భవన్‌ మౌన సమాధానం కానుంది. ఢిల్లీలో స్థలం కేటాయింపుపై ప్రకటన వెలువడటంతో ఇక బదాలయింపునకు సంబంధించిన అధికారిక ప్రక్రియను టీఆర్‌ఎస్‌ నాయకత్వం పూర్తి చేయనున్నది. త్వరలోనే మంచి ముహుర్తం చూసి టీఆర్‌ఎస్‌ భవన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ తెలిపారు. త్వరితగతిన వీలైతే ఆర్నేళ్లలో ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. కార్యాలయ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పలువురు ఎంపీలు ఇప్పటికే పరిశీలించారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సీఎం కేసీఆర్‌కు వివరించారు. మరోవైపు పార్లమెంటు ఉభయసభల్లో కనీసం ఏడుగురు సభ్యులున్న రాజకీయ పార్టీకి దేశ రాజధానిలో కార్యాలయం నిర్మించుకునేందుకు కేంద్రం స్థలం కేటాయిస్తుంది. ఉభయ సభల్లో టీఆర్ఎస్‌కు మొత్తం 16 మంది ఎంపీలు ఉన్నారు..

- Advertisement -

Latest news

Related news

కొవిడ్ వ్యాక్సిన్ బండికి బాజాభజంత్రీలతో స్వాగతం

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లో...

మొదటిరోజు వాక్సినేషన్ విజయవంతం

రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మొత్తం 4296 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈరోజు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

1020వ గుండెను కాపాడిన సూపర్ స్టార్

సాటివారికి సాయం చేయడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. తాను నిజంగా కూడా శ్రీమంతుడినే అని నిరూపించుకున్న సంఘటనలు బోలెడున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత...

తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నేషనల్ పార్క్ బంద్

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ఐసీఎఆర్...