24.1 C
Hyderabad
Tuesday, November 24, 2020

ఢిల్లీలో మళ్లీ పెరుగుతున్న వాయుకాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకు పెరుగుతోంది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ తాజా గణాంకాల ప్రకారం వాయుకాలుష్యం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దేశ రాజధానిలో ఇవాళ ఉదయం పొగ సన్నని పొరలా వ్యాపించిందని డీపీసీసీ తెలిపింది. ఢిల్లీ రాజధాని ప్రాంతంలో కాలుష్య నియంత్రణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ గెజిట్ విడుదల చేసింది. ఢిల్లీతోపాటు హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాలను కూడా ఈ ఆర్డినెన్స్ పరిధిలోకి కేంద్రం తీసుకువచ్చింది. కమిషన్ చైర్మన్ గా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి లేదా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి పూర్తికాలం చైర్మన్ గా వ్యవహరిస్తారు. పంజాబ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ప్రధాన కార్యదర్శి లేదా, పర్యావరణ సంబంధ వ్యవహారాలు చూసే కార్యదర్శి స్థాయి అధికారులు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉండనున్నట్లు కేంద్రం తెలిపింది.

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...