21.4 C
Hyderabad
Friday, December 4, 2020

తెరుచుకున్న నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు

నాగార్జునసాగర్ ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టానికి చేరువ కావడంతో అధికారులు గేట్లు ఎత్తాలని నిర్ణయించారు. ఉదయం 11 గంటల తర్వాత సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహ్మయ్య, సీఈ నర్సింహా కలిసి గేట్లు ఎత్తి  దిగువకు నీటిని విడుదల చేశారు. ముందుగా నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతిని బట్టి ఇంకా కొన్ని ఎత్తే ఆలోచనలో అధికారులు ఉన్నారు. కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం  590.00 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 585  అడుగులకు చేరుకున్నది.  పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా 

ప్రస్తుత నీటి నిల్వ 290 టీఎంసీలు గా ఉంది. శ్రీశైలం నుంచి ఇన్ ఫ్లోగా 4 లక్షల  క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టు గరిష్ఠ మట్టానికి చేరుకోవడంతో పాటు ఎగువ నుంచి భారీగా ఇన్ ఫ్లో వస్తుండటంతో కొద్దిసేపటి క్రితం రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. వరద ఉధృతి బట్టి మరికొన్ని గేట్లు కూడా తెరుస్తామని అధికారులు చెప్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

ఫ్రంట్ లైన్ సిబ్బంది.. డేటాబేస్ రెడీ చేయండి : సీఎస్ సోమేష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వివరాలతో కూడిన డేటా బేస్...

కేంద్ర ప్రభుత్వం భోజనాన్ని తిరస్కరించిన రైతులు

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను గురువారం కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలకు పిలిచింది. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కేంద్రమంత్రులు పీయూష్‌...

త్వరలో వరంగల్లో ఎలక్ట్రిక్ బస్సులు

ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వరంగల్‌ లో కూడా బ్యాటరీ బస్సులు నడిపించాలనుకున్నా సమ్మె, కరోనా కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా కేంద్రప్రభుత్వ గైడ్‌లైన్స్‌ మేరకు...

ఆ అబ్బాయి ఎన్నికల విధులకు రాలేదు : ఈసీ

17 సంవత్సరాల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇప్పారు. ఆ వార్తల్లో నిజం లేదని సదరు...