21.1 C
Hyderabad
Monday, November 30, 2020

తెలంగాణను దేశంలో నెంబర్ వన్ గా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం -మంత్రి కేటీఆర్

తెలంగాణను దేశంలో నెంబర్ వన్ గా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. స‌న‌త్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో రూ. 5 కోట్ల‌తో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సనత్ నగర్ నెహ్రూ పార్కులో థీమ్ పార్క్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేటీఆర్ ప్ర‌సంగించారు. రాష్ట్రంలో సంపదను సృష్టించి పేదవారికి పంచేందుకు సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారని తెలిపారు. భూములు ఉండి యాజమాన్య హక్కులు లేనివారికి పట్టాలిచ్చే బాధ్యతను తాము తీసుకుంటామన్నారు మంత్రి కేటీఆర్‌. ప్రజలు అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం పని చేస్తున్నదని.. అలాగే ప్రజలు కూడా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని అన్నారు మంత్రి కేటీఆర్.

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.