17.9 C
Hyderabad
Saturday, November 28, 2020

తెలంగాణను పలకరించిన తొలకరి….

నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, కామా రెడ్డి, నిజామాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో 14, గార్లలో 13, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో 10.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. హన్మకొండ, యాదగిరిగుట్టలో 12 సెంటీమీటర్ల చొప్పున  వర్షం కురిసింది.

భారీ వర్షం కురుస్తుండడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లోని పలు చెరువుల్లోకి వరద నీరు చేరింది. కొత్తగూడెంలో 5.8, మణుగూరులో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఖమ్మం జిల్లాలోని బోనకల్, మధిర, ఎర్రుపాలెం, చింతకాని, కొణిజర్ల, వైరా మండలాల్లోభారీవర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మరో వైపు  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోనూ పలుచోట్ల వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలో 3  ఆదిలాబాద్ జిల్లాలో 2.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తొలకరి పలుకరించడంతో నిర్మల్, భైంసా, ఖానాపూర్, ఉట్నూర్, బోథ్, టేల,సిరికొండ మండలాల్లో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డిలో 2.8  నిజామాబాద్ లో 2.1 సెంమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్లగొండ జిల్లాలోని 30 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా మునుగోడులో 9.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు సిద్ధిపేట జిల్లా సిద్ధిపేటలో భారీ వర్షం కురిసింది. హైదరా బాద్ నగరంలోని హఫీజ్ పేట, మియాపూర్, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల లో తేలికపాటి వర్షాలు కురిసాయి.   

రాష్ట్రంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.. నైరుతి రుతుపవనాలకు తోడు చత్తీస్ ఘడ్ లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు  రాష్ట్రంలో పటు చోట్లు మోస్తారు వర్షంతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ కేంద్రం ప్రకటించింది.

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...