27 C
Hyderabad
Friday, December 4, 2020

తెలంగాణలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌ తేదీలు ఖరారు

రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సమాయత్తమవుతున్నది. సెప్టెంబర్ 9 నుంచి 14వ తేదీల్లో ఎంసెట్ లో ఇంజనీరింగ్ విభాగానికి మాత్రమే ప్రవేశపరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 31న ఈసెట్, సెప్టెంబర్ 2న పాలిసెట్ నిర్వహిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎంసెట్ లో ఫార్మసీ, అగ్రికల్చర్‌ విభాగంతోపాటు ఎడ్‌ సెట్‌, ఐసెట్‌, పీజీఈసెట్‌, లాసెట్ వంటి ప్రవేశపరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ త్వరలోనే ప్రకటిస్తారు. ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలను కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిర్వహించనున్నారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలను ప్రతిరోజు రెండు పూటలా నిర్వహిస్తారు. ఉదయం 18 వేలు, మధ్యాహ్నం 18 వేల చొప్పున విద్యార్థులకు ఎంసెట్ నిర్వహించాలని భావిస్తున్నారు.

ఈనెల 20 నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు నిర్వహించనున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు దూరదర్శన్‌, టీశాట్‌ ద్వారా తరగతులు జరుగుతాయి. సెప్టెంబర్‌ 1 నుంచి 3 -5 తరగతుల విద్యార్థులకు డిజిటల్‌ క్లాసులు నిర్వహిస్తారు. ఇక ఈ నెల 17 నుంచి ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు ఉంటాయి. సెప్టెంబర్‌ 1 తర్వాత ఇంటర్‌ ప్రవేశాల ప్రక్రియ చేపడతామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఈనెల 31న ఈసెట్‌, సెప్టెంబర్‌ 2న పాలిసెట్‌, సెప్టెంబర్‌ 9,10,11,14 తేదీల్లో ఎంసెట్‌ నిర్వహించాలని భావిస్తున్నామన్నారు.

అక్టోబర్ అడ్మిషన్ల ప్రక్రియ జరుగనుంది. ఎంసెట్ ఇంజనీరింగ్‌ పరీక్షా ఫలితాలను సెప్టెంబర్ నెలాఖరులోగా విడుదల చేయనున్నారు. మరోవైపు డిగ్రీ ఫైనలియర్ పరీక్షలు, ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంశం కోర్టుల్లో పెండంగ్ లో ఉన్నది.

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....