22.4 C
Hyderabad
Tuesday, October 27, 2020

తెలంగాణలో కరోనా కమ్యూనిటీ వ్యాప్తి లేదు

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రతను అంచనా వేసేందుకు ఐసీఎమ్మార్‌ చేపట్టిన ప్రివలెన్స్‌ సర్వేలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సామాజిక వ్యాప్తి లేదని తేలింది. ఐసీఎమ్మార్‌, ఎన్‌ఐఎన్‌ సంయుక్తంగా నిర్వహించిన సర్వే వివరాలను  వెల్లడించింది. హైదరాబాద్‌ సహా నాలుగు జిల్లాల పరిధిలో చేపట్టిన సర్వేలో 1,700 మంది నుంచి శాంపిళ్లను సేకరించగా.. ఇందులో 19 మందికి మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాప్తిని గుర్తించేందుకు మే 15 నుంచి 17వ తేదీ వరకు జనగామ, కామారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఐసీఎమ్మార్‌ ప్రివలెన్స్‌ సర్వే చేపట్టింది. 

ఒక్కో జిల్లాలో 400 శాంపిళ్ల చొప్పున మొత్తం 1,200 మంది శాంపిళ్లు సేకరించగా, ఇందులో 4 మాత్రమే పాజిటివ్‌గా తేలాయి. ఐసీఎమ్మార్‌ సర్వేలో అతి తక్కువ మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో వైరస్‌ సామాజిక వ్యాప్తి లేదని తెలుస్తున్నది. మే 30, 31 తేదీల్లో గ్రేటర్‌లోని 5 కంటైన్మెంట్‌ జోన్లు ఆదిభట్ల, తప్పచబుత్ర, మియాపూర్‌, చందానగర్‌, బాలాపూర్‌లో ఐసీఎమ్మార్‌ సీరం సర్వే నిర్వహించింది. ఒక్కో జోన్‌లో 100 శాంపిళ్ల చొప్పున మొత్తం 500 మంది నమూనాలు సేకరించి పరీక్షించగా, కేవలం 15 మందికి మాత్రమే కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

లాక్‌డౌన్‌ విజయవంతంగా అమలుచేయడం వల్లే వైరస్‌ కట్టడి సాధ్యమైందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. ఐసీఎమ్మార్‌ సర్వే దీనిని స్పష్టంచేస్తున్నదని తెలిపారు.

- Advertisement -

Latest news

Related news

జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు ప్రభుత్వం దసరా కానుక అందజేసింది. అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 840 రెండు పడక...

దేశంలో 79లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతుందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 79లక్షలకు చేరువైంది. గత 24గంటల్లో 45వేల 149కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల...

పాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఈరోజు ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ...