28.6 C
Hyderabad
Wednesday, July 8, 2020

తెలంగాణలో కొత్తగా 71 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 71 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1991 కు చేరుకుంది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 650. కాగా కోవిడ్‌-19తో రాష్ట్రంలో నేడు ఒకరు మృతిచెందారు. వ్యాధి కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 57 మంది చనిపోయారు. కోవిడ్‌-19 నుంచి కోలుకుని నేడు 120 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి 1284 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 38, రంగారెడ్డి-7, మేడ్చల్‌-6, వలస కూలీలు-12, విదేశాల నుంచి వచ్చినవారు-4, సూర్యాపేట-1, వికారాబాద్‌-1, నల్లగొండ-1, నారాయణపేట-1.

- Advertisement -

Latest news

కరోనా మరణాల సంఖ్య తగ్గించడంపై కేజ్రీవాల్‌ సర్కార్‌ ఫోకస్‌

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. దీంతో కరోనా మృతుల సంఖ్యను తగ్గించడంపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గడిచిన రెండు వారాల్లో చనిపోయిన...

Related news

కరోనా మరణాల సంఖ్య తగ్గించడంపై కేజ్రీవాల్‌ సర్కార్‌ ఫోకస్‌

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. దీంతో కరోనా మృతుల సంఖ్యను తగ్గించడంపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గడిచిన రెండు వారాల్లో చనిపోయిన...

ఉత్తరప్రదేశ్‌ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఉత్తర ప్రదేశ్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 1346కొత్తకేసులు వెలుగులోకి వచ్చాయి.నిన్నటికి నిన్న 18మంది మృతి చెందగా మరణాల సంఖ్య 827కు చేరింది....

హిమాచల్‌ ప్రదేశ్‌ లో వికాస్‌ దూబే అనుచరుడి ఎన్‌ కౌంటర్‌

కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబే అనుచరుడు పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ లో అమర్ దూబేను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో...

24 గంటల్లో 22,752 కరోనా కేసులు

 భారత్‌ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కేసులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. గడిచిన 24గంటల్లో 22వేల752 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల...