23.6 C
Hyderabad
Saturday, November 28, 2020

తెలంగాణ ఉద్యోగుల‌కు శుభవార్త… ఈ నెల పూర్తి వేతనం

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ నెల పూర్తి వేతనం చెల్లించాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర ఆదాయ పరిస్థితి కొద్దిగా మెరుగుపడినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ విధించడంతో.. రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయింది. కేంద్రం నుంచి సహాయం అందలేదు. ఉన్న కొద్దిపాటి వనరులతోనే కొవిడ్ నివారణ చర్యలు చేపట్టడం, వలస కూలీలను ఆదుకోవడం, పేద ప్రజలకు ఉచితంగా బియ్యం, నగదు పంపిణీ చేయడం వంటివి చేపట్టాల్సి వచ్చింది. అదే సమయంలో రైతులకు అండగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొంత కష్టమైనప్పటికీ.. ఉద్యోగుల వేతనాల్లో కొంత మొత్తం చెల్లించకుండా వాయిదా వేశారు. పరిస్థితులు కుదుట పడిన తర్వాత ఇస్తామని తెలిపారు. ఈ నెల పూర్తి వేతనం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులు స్వాగతించారు. ముఖ్యమంత్రి మాటపై నమ్మకముంచారు. ఉద్యోగులు, పెన్షనర్లు మార్చి, ఏప్రిల్, మే నెల వేతనంలో కొంత మేరకు కోత విధించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆదాయం పెరుగుతుండటంతో.. జూన్ నెల వేతనం పూర్తిగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

జూన్ నెల జీతం పూర్తిగా చెల్లించాలని నిర్ణయించడంపై ఉద్యోగుల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. జీఎన్జీవో నేతలు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అటు సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు.  

- Advertisement -

Latest news

హైదరాబాద్‌ మద్దతు.. టీఆర్‌ఎస్‌కే

టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ముఖ్యమంత్రి వేదిక పైకి రాగానే.. కార్యకర్తలు, అభిమానులు చప్పట్లు, కేరింతలతో ఈలలు వేస్తూ.. సభలు ఉత్సాహం నింపారు. టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ముఖ్యమంత్రి వేదిక పైకి రాగానే.. కార్యకర్తలు, అభిమానులు చప్పట్లు, కేరింతలతో ఈలలు వేస్తూ.. సభలు ఉత్సాహం నింపారు. సభకు వచ్చిన ప్రజలకు అభివాదం చేసిన కేసీఆర్‌ను చూసిన ప్రజలు చేతులెత్తి.. చప్పట్లు కొడుతూ తమ మద్ధతు తెరాసకే అని  తెలియజేశారు.

Related news

మంత్రి ఎర్రబెల్లి.. ఇంటింటి ప్రచారం

హైదరాబాద్‌ నగరంలో కేవలం టీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధ్యమయిందని.. పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మీర్‌పేట హౌసింగ్‌బోర్డు కాలనీ డివిజన్‌లో ఆయన ఇంటింటికీ...

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.