28.4 C
Hyderabad
Thursday, October 1, 2020

తెలంగాణ జాతి గర్వించదగ్గ సాహితివేత్త తిరునగరి రామానుజం: సీఎం కేసీఆర్

తెలంగాణ జాతి గర్వించదగ్గ సాహితివేత్త తిరునగరి రామానుజం అని సీఎం కేసీఆర్ అభినందించారు. మహాకవి దాశరథి సాహితీ వారసుడిగా రామానుజం నిలుస్తారని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.  ప్రగతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో 2020 యేడాది మహాకవి దాశరథి పురస్కారమును రామానుజంకు సీఎం కేసీఆర్ అందించారు.  శాలువా కప్పి సత్కరించి, జ్ఞాపికతో పాటు ఒక లక్ష వెయ్యి నూట పదహారు రుపాయల నగదు పురస్కారంను అందించారు.  దాశరథి పురస్కారం పొందడానికి రామానుజం వందకు వందశాతం అర్హుడన్నరు. ఆయన రాసిన బాలవీర శతకం, అక్షరధార, తిరునగరీయం లాంటి రచనలు ఎంతో ఆదరణ పొందాయన్నరు.  సంప్రదాయ, సంస్కృత భాష పరిజ్ఞానం కలిగి ఉండడంతో పాటు ఆధునిక సాహిత్య అవగాహన కలిగిన సాహితివేత్తగా రామానుజం నిలుస్తారని సీఎం కేసీఆర్ అభినందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ పాడి వినిపించిన పద్యం అందరినీ ఆకట్టుకున్నది.

- Advertisement -

Latest news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

Related news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

లైంగిక వేధింపుల కేసులో పోలీసుల ముందుకు అనురాగ్‌ కశ్యప్‌

లైంగిక వేధింపుల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ఫిల్మ్ డైర‌క్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ ..  ముంబైలోని వెర్సోవా పోలీసుల ముందు హాజరయ్యారు. న‌టి పాయల్ ఘోష్  ఆరోపణలతో పలు విషయాలపై...

రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 75వ వసంతం లోకి అడుగుపెట్టిన సందర్భంగా సీఏం కేసీఆర్ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు....

దేశంలో 24 గంటల్లో 86,821 కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య లక్షకు చేరువైంది. నిన్నటికి నిన్న 1వెయ్యి 181 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 98వేల678...